2026-2027 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ బడ్జెట్ ప్రకటించింది కేంద్రం. ఆదివారం ( ఫిబ్రవరి 1 ) జరిగిన బడ్జెట్ సమావేశాల్లో 2026 బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్. ఈ ఏడాది బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయింపులు పెరిగాయి. విద్యారంగానికి రూ. 1 లక్షా 39 వేల 289.48 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు నిర్మలాసీతారామన్. ఇది గత ఏడాది కంటే 6.22 శాతం ఎక్కువ. గత ఏడాది బడ్జెట్ లో విద్యారంగానికి రూ. 1 లక్షా 28 వేల 650 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.
ఈ ఏడాది బడ్జెట్ లో ఉన్నత విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించింది కేంద్రం. మూడు కొత్త AIIMS ఏర్పాటును ప్రతిపాదించింది కేంద్రం. ఐదేళ్ళలో 75 వేల మెడికల్ సీట్లను పెంచాలని నిర్ణయించింది ప్రభుత్వం. మూడు కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లను స్థాపించనున్నట్లు తెలిపింది.
విద్యా బడ్జెట్: 10 కీలక అంశాలు
- మూడు కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఏర్పాటు
- మూడు కొత్త నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏర్పాటు
- ఐదు విశ్వవిద్యాలయ టౌన్‌షిప్‌లను ఏర్పాటు.
- ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్లు ఏర్పాటు.
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదన
- LRS పథకం కింద విద్య, వైద్య ప్రయోజనాల కోసం TCS రేటును 5 శాతం నుండి 2 శాతానికి తగ్గింపు.
- విద్య నుండి ఉపాధి, వ్యవస్థాపకత అనే రంగంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు.
- 3 కొత్త ఎయిమ్స్ ఏర్పాటు.
- ఐదేళ్లలో 75వేల మెడికల్ సీట్లు.
- ICAI, ICSI, ICMAIల సహకారంతో కార్పొరేట్ మిత్ర ఏర్పాటు
