ఆఫ్ఘనిస్థాన్‌పై భారీ విజయం.. కానీ టీమిండియాకు నో యూజ్.. కారణం ఇదే!

ఆఫ్ఘనిస్థాన్‌పై భారీ విజయం.. కానీ టీమిండియాకు నో యూజ్.. కారణం ఇదే!

India vs Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో భారత జట్టు రికార్డ్ విజయాన్ని నమోదు చేసింది. 93 ఏళ్ల టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే కని వినీ ఎరుగని గెలుపుని కైవసం చేసుకుంది. ముల్లాన్‌పూర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో ఇవాళ (సోమవారం) ముగిసిన టెస్ట్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత్ ఇన్నింగ్స్ 300 రన్స్ భారీ తేడాతో విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత్‌కు ఇది అతిపెద్ద గెలుపు. ఈ భారీ విజయంతో భారత్‌కు నో యూజ్. 

ఆఫ్ఘన్ పై గెలిచిన నో యూజ్: 
భారీ విజయాన్ని నమోదు చేసుకున్నప్పటికీ, డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో భారత్ స్థానం ఏ మాత్రం చేంజ్ కాలేదు.. ఎందుకంటే ఈ మ్యాచ్‌.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025–27 సైకిల్‌లో భాగం కాదు కాబట్టి, ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెట్‌కు ప్రోత్సాహం అందించేందుకు ఈ ఉత్తిత్తి మ్యాచ్ ని టీమిండియా ఆడింది అంతే.. దాంతోనే ఈ విజయంతో ఇండియాకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. డబ్ల్యూటీసీ 2025–27 పాయింట్స్ టేబుల్‌లో ప్రస్తుతం భారత్ 48.15 విన్నింగ్ పర్సంటేజ్‌తో 6వ స్థానంలోనే ఉండిపోయింది. ఈ సైకిల్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన భారత్ కేవలం 4 మాత్రమే గెలిచి మరో నాలుగింట్లో ఓడింది. ఒక మ్యాచ్ డ్రా కూడా అయ్యింది.

►ALSO READ | డిఫెన్స్ ప్రాక్టీస్ చేయమంటే సిక్సులు కొట్టాడు.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వైభవ్ సూర్యవంశీ వీడియో! 

9 మ్యాచుల్లో కనీసం 7 గెలవాల్సిందే: 
గతేడాది ఇంగ్లాండ్ టూర్ తో డబ్ల్యూటీసీ సైకిల్‌‌ను భారత జట్టు ప్రారంభించింది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 2–2తో ఈక్వల్ చేసేసింది. ఈ సైకిల్‌లో ఇండియా ఇంకా 9 మ్యాచ్‌లు ఆడాలి.. శ్రీలంకలో రెండు, న్యూజిలాండ్‌లో రెండు, సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో 5 టెస్ట్‌ల్లో ఇండియన్ జట్టు పోటీపడాలి.. ఫైనల్ రేసులో తప్పకుండా ఉండాలంటే భారత్ ఈ 9 మ్యాచ్‌ల్లో కనీసం 7 మ్యాచుల్లో గెలవాల్సిందే. న్యూజిలాండ్ గడ్డపై భారత్ చివరిసారిగా 2009లో టెస్టు మ్యాచ్ లో విజయం సాధించింది. అక్కడే జరిగే మ్యాచ్‌లు టీమిండియాకు పెద్ద సవాల్‌ అని చెప్పాలి. ఈ 9 మ్యాచ్‌లకు సన్నాహకంగానే భారత్ ఆఫ్ఘన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడింది.