డిఫెన్స్ ప్రాక్టీస్ చేయమంటే సిక్సులు కొట్టాడు.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వైభవ్ సూర్యవంశీ వీడియో! 

డిఫెన్స్ ప్రాక్టీస్ చేయమంటే సిక్సులు కొట్టాడు.. నెట్టింట చక్కర్లు కొడుతున్న వైభవ్ సూర్యవంశీ వీడియో! 

Vaibhav Suryavanshi: శ్రీలంక టూర్‌లో ఉన్న ఇండియా-ఏ (India-A) టీమ్ మ్యాచ్‌కు ముందు 15 ఏళ్ల యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) నెట్స్ ప్రాక్టీస్‌లో ఒక మస్తు ఇంట్రెస్టింగ్ సీన్ క్రియేట్ చేశాడు. శ్రీలంక పిచ్చులు సాధారణంగా కాస్త స్లోగా ఉంటాయి కాబట్టి.. కోచ్‌లు మనోడిని కాసేపు వికెట్ కాపాడుకుంటూ సాలిడ్ డిఫెన్స్ ప్రాక్టీస్ చేయమని చెప్పారు.

ఫస్ట్ కొన్ని బాల్ డిఫెన్స్: 
నెట్స్‌లోకి దిగగానే కోచ్‌లు చెప్పినట్టే వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ కొన్ని బాల్స్‌ను మస్తు జాగ్రత్తగా చూస్తూ.. డిఫెన్స్ ఆడటానికే ట్రై చేశాడు. గేమ్ డిఫెన్సివ్ సైడ్ ఇంప్రూవ్ చేసుకోవాలనే కమిట్‌మెంట్‌తోనే కాసేపు వాచ్‌ఫుల్‌గా కనిపించాడు. కానీ, ఎక్కువ సేపు డిఫెన్స్ ఆడటం ఈ పిల్లాడి వల్ల కాలేదు.. కొద్దిసేపట్లోనే వైభవ్ తన నేచురల్ స్టైల్‌లోకి షిఫ్ట్ అయిపోయి.. షాట్లు కొట్టడం స్టార్ట్ చేశాడు. ఇక ఒక్కసారి గేర్ మార్చాక వెనక్కి తిరిగి చూసుకోలేదు. డిఫెన్స్ ముచ్చట పక్కనబెట్టి.. బౌలర్లు వేసే ప్రతి బాల్‌పై ఎటాకింగ్‌కు దిగాడు. దొరికిన ప్రతి ఛాన్స్‌ను వదలకుండా అగ్రెసివ్ స్ట్రోక్స్ ఆడటం ప్రారంభించాడు. 

►ALSO READ | నువ్వు ఫ్యూచర్లో ఇండియా కెప్టెన్ అవుతావ్.. తిలక్ వర్మకు గౌతమ్ గంభీర్ హింట్!

సోషల్ మీడియాలో పవర్ హిట్టింట్ వీడియో: 
ప్రాక్టీస్ సెషన్ ముందుకు సాగుతున్న కొద్దీ.. డిఫెన్స్ విషయం పూర్తిగా మాయమైపోయింది. వైభవ్ సూర్యవంశీ ప్రతి బాల్‌ను బౌండరీ దాటించడమే టార్గెట్‌గా పవర్‌హిట్టింగ్ చేస్తూ నెట్స్‌ను కాస్తా ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌గా మార్చేశాడు. వైభవ్ భయం లేకుండా ఆడిన ఈ ఫియర్‌లెస్ స్ట్రోక్‌ప్లే వీడియో ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు.