నువ్వు ఫ్యూచర్లో ఇండియా కెప్టెన్ అవుతావ్.. తిలక్ వర్మకు గౌతమ్ గంభీర్ హింట్!

నువ్వు ఫ్యూచర్లో ఇండియా కెప్టెన్ అవుతావ్.. తిలక్ వర్మకు గౌతమ్ గంభీర్ హింట్!

Future India Captain Tilak Varma: టీమిండియా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యాటర్, మన హైదరాబాద్ పొరగాడు తిలక్ వర్మ (Tilak Varma) కు భారీ ప్రమోషన్ దక్కింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు ముందు భారత టీ20 జట్టులో (India T20I Team) ఒక పెద్ద మార్పు చోటు చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు సారథ్య బాధ్యతలు అప్పగించగా.. వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మను సెలెక్ట్ చేశారు. ఈ క్రేజీ ప్రమోషన్ తర్వాత ప్రెస్ మీట్‌లో మాట్లాడిన తిలక్ వర్మ.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir), రోహిత్ శర్మ (Rohit Sharma) లతో తనకున్న బాండింగ్, కెప్టెన్సీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.  

గంభీర్ నాకు ముందే చెప్పాడు:
టీమిండియా సీనియర్ జట్టుకు వైస్ కెప్టెన్ కావడంపై తిలక్ వర్మ మస్తు ఎక్సైట్ అయ్యాడు. ఈ పోస్టు నాపై ఎలాంటి ప్రెజర్ పెంచలేదు, కానీ మరింత రెస్పాన్సిబిలిటీని పెంచింది.. నా పేరు పక్కన వైస్ కెప్టెన్ అని చూడగానే మరింత మెచ్యూరిటీ వచ్చినట్టు అనిపిస్తుంది.. నేను ఇండియా టీమ్ తరఫున ఆడేటప్పుడు ఎప్పుడూ గౌతమ్ గంభీర్ సార్‌తో మాట్లాడుతుంటాను.. 'నువ్వు ఇండియా-ఏ టీమ్‌ను లీడ్ చేస్తున్నప్పుడే.. ఫ్యూచర్‌లో మెయిన్ టీమ్‌ను ఎలా నడిపించాలో ఆలోచించాలి.. ఎందుకంటే ఏదో ఒకరోజు నువ్వు సీనియర్ జట్టుకు కెప్టెన్ అవుతావు అని గంభీర్ నాకు హింట్ ఇచ్చేవారు.. అందుకే నేను మానసికంగా ఎప్పుడో ప్రిపేర్ అయి ఉన్నాను.. కరెక్ట్ టైమ్‌లోనే నాకు ఈ ఛాన్స్ దక్కిందని తిలక్ వర్మ వెల్లడించాడు. 

కెప్టెన్సీ గురించి రోహిత్ శర్మతో డిస్కషన్: 
రోహిత్ శర్మతో ఉన్న క్లోజ్ బాండింగ్ గురించి తిలక్ వర్మ మాట్లాడుతూ.. నేను రోహిత్ భాయ్‌తో బ్యాటింగ్ గురించి పెద్దగా మాట్లాడను.. కానీ కెప్టెన్సీకి సంబంధించిన విషయాలు మాత్రం మస్తు అడుగుతాను.. ప్రెజర్ సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు నీ మైండ్ ఎలా వర్క్ చేస్తది? ఎలా ఆలోచిస్తావు? అని అడిగి మరీ చిన్న చిన్న విషయాలను నేర్చుకుంటాను.. హిట్ మ్యాన్ ఇచ్చిన గైడెన్స్, నా స్కిల్స్ అన్నింటినీ కలిపి.. ఫ్యూచర్‌లో శ్రేయస్ అయ్యర్‌కు నా వంతు సాయం అందిస్తాను.. ఇది నాకు ఫ్యూచర్‌లో మస్తు యూజ్ అవుతుందని తిలక్ వివరించాడు.

►ALSO READ | భారత జట్టులో దక్కని చోటు.. బెంగాల్ టీ20 లీగ్‌లో హాట్రిక్ వికెట్లతో చెలరేగిన షమీ.. సెలెక్టర్లకు గట్టి కౌంటర్

ఇండియా–ఏ కెప్టెన్‌గా  తిలక్ వర్మ: 
ఇండియా సీనియర్ జట్టుతో బ్రిటన్ (UK) ఫ్లైట్ ఎక్కడానికి ముందే.. తిలక్ వర్మ ప్రస్తుతం శ్రీలంకలో జరగబోయే లిస్ట్-ఏ ట్రై-సిరీస్‌లో 'ఇండియా-ఏ' జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దంబుల్లా వేదికగా రేపటి (జూన్ 9 ) నుంచి జూన్ 21 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. తిలక్ వర్మ కెరీర్‌లో 'ఇండియా-ఏ' టీమ్‌ను లీడ్ చేయడం ఇది మూడోసారి.. గతంలో 2024 ఎమర్జింగ్ ఏషియా కప్‌లో టీ20 ఫార్మాట్‌కు, ఆ తర్వాత సౌతాఫ్రికా-ఏ తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు కూడా మన తెలుగోడే కెప్టెన్‌గా ఉన్నాడు.