Mohammed Shami HatTrick: టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ (Mohammed Shami) గ్రౌండ్‌లో మళ్లీ రచ్చ చేస్తున్నాడు. బెంగాల్ టీ20 లీగ్ (Bengal T20 League) లో సిలిగురి స్ట్రైకర్స్ (Siliguri Strikers) తరఫున ఆడుతున్న షమీ.. రార్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మైండ్ బ్లాక్ చేసే విధంగా హాట్రిక్ వికెట్లతో అద్భుత విజయాన్ని అందించాడు. ఒకవైపు టీమిండియా సెలెక్టర్లు అన్ని ఫార్మాట్లలో అతడ్ని పక్కనబెడుతున్న తరుణంలో.. షమీ ఈ రేంజ్ మాస్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఒకే ఓవర్లో మూడు వికెట్లు:
రార్ టైగార్స్ తో జరిగిన మ్యాచ్ 16వ ఓవర్లో మహమ్మద్ షమీ చెలరేగిపోయాడు. ఓవర్లో మొదట షాబాజ్ అహ్మద్‌ను అవుట్ చేయగా, ఆ తర్వాత వరుస బంతుల్లో రోహిత్ కుమార్, దీపాంజన్ ముఖర్జీలను పెవిలియన్ కి పంపడంతో హాట్రిక్ వికెట్లని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్లు వేసిన షమీ.. కేవలం 27 రన్స్ ఇచ్చి కీలకమైన 4 వికెట్లు (4/27) పడగొట్టి సిలిగురి గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు.
డొమెస్టిక్‌లో వికెట్లు.. టీమిండియాలోకి నో ఎంట్రీ:
నిజానికి మహమ్మద్ షమీ డొమెస్టిక్ సీజన్‌లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేశాడు. 16 డొమెస్టిక్ మ్యాచుల్లో ఏకంగా 47 వికెట్లు పడగొట్టాడు (ఇందులో రంజీ ట్రోఫీలో 20, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 16, విజయ్ హజారే ట్రోఫీలో 11 వికెట్లు ఉన్నాయి). అయినా సరే, రీసెంట్‌గా జరిగిన న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు, ఇప్పుడు జరుగుతున్న ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ సిరీస్‌కు సెలెక్టర్లు షమీని అస్సలు పరిగణనలోకి తీసుకోలేదు. మార్చి 2025లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత షమీ మళ్లీ ఇప్పటి వరకు టీమిండియా జెర్సీ వేసుకోలేదు.
►ALSO READ | భారత్ చారిత్రాత్మక విజయం.. 93 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైమ్!
షమీని ఎందుకు పక్కనబెట్టారు?:
మహమ్మద్ షమీని టీమ్‌లోకి తీసుకోకపోవడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. షమీ టెస్ట్ రీఎంట్రీపై ప్రస్తుతానికి ఎలాంటి చర్చలు జరగలేదు.. అతను ఈ ఏడాది డొమెస్టిక్ సీజన్ ఆడాడని మాకు తెలుసు.. కానీ మాకున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతానికి అతని బాడీ కేవలం టీ20 క్రికెట్ ఆడటానికే సెట్ అవుతుంది.. అందుకే అతని వర్క్‌లోడ్, ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకుని వన్డే, టెస్ట్ సిరీస్‌లకు పరిగణలోకి తీసుకోలేదని తేల్చి చెప్పాడు.
లక్నో సూపర్ జాయింట్స్ ఫ్యూచర్ ప్లాన్స్:
మరోవైపు ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జాయింట్స్ (LSG) తరఫున ఆడిన షమీ 12 వికెట్లు తీసినప్పటికీ.. 38.25 యావరేజ్ వల్ల కాస్త కాస్ట్‌లీగా మారాడు, పైగా ఎల్‌ఎస్‌జీ పాయింట్ల టేబుల్‌లో లాస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ప్రస్తుతం సెలెక్టర్ల ఫోకస్ అంతా 2027 వన్డే వరల్డ్ కప్, నెక్స్ట్ టెస్ట్ సైకిల్స్ కోసం యంగ్ ఫాస్ట్ బౌలర్లను రెడీ చేయడంపైనే ఉంది.
