భారత్ చారిత్రాత్మక విజయం.. 93 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైమ్!

భారత్ చారిత్రాత్మక విజయం.. 93 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైమ్!

India vs Afghanistan: న్యూ చండీగఢ్ లోని ముల్లన్‌పూర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన టీమిండియా ఒక అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. 1932 నుంచి అంతర్జాతీయ టెస్టులు ఆడుతున్న భారత జట్టుకు.. గత 93 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలోనే ఇదే అత్యంత అతి పెద్ద విజయం కావడం విశేషం. ఆఫ్ఘనిస్థాన్‌ను ఫాలోఆన్ ఆడించి మరీ ఇన్నింగ్స్, 300 పరుగుల తేడాతో ఓడించి టీమిండియా ఈ నయా రికార్డును సెట్ చేసింది.

93 ఏళ్ల కిందట మొదలైన భారత టెస్ట్ ప్రయాణంలో.. న్యూ చండీగర్ లోని ముల్లన్‌పూర్‌లో సాధించిన ఈ విజయం సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దీంతో టీమిండియా ఆటగాళ్ల డామినేషన్‌కు క్రికెట్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ఫుల్ ఖుషీ అవుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్నీ విజయాలని భారత జట్టు అందుకోవాలని పేర్కొంటున్నారు. 

టెస్ట్ క్రికెట్ హిస్టరీలో భారత్ టాప్–5 విజయాలు ఇవే: 
* 2026లో ఇన్నింగ్స్ & 300 రన్స్ -తేడాతో ఆఫ్ఘనిస్థాన్ పై భారత్ విజయం (ఆల్-టైమ్ నంబర్ 1 బిగ్గెస్ట్ విక్టరీ).
* 2018లో ఇన్నింగ్స్ & 272 రన్స్ -తేడాతో- వెస్టిండీస్ పై గెలిచిన భారత్
* 2018లో ఇన్నింగ్స్ & 262 రన్స్ తేడాతో- ఆఫ్ఘనిస్థాన్ పై విజయం సాధించిన టీమిండియా
-* 2007లో ఇన్నింగ్స్ & 239 రన్స్ తేడాతో- బంగ్లాదేశ్ పై భారత్ గెలుపు
* 2017లో ఇన్నింగ్స్ & 239 రన్స్ తేడాతో శ్రీలంకపై టీమిండియా విక్టరీ