మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న చిత్రం ‘Mega 158’ . ఈ సినిమా గురువారం ఉదయం పూజా కార్యక్రమాలతో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చి ముహూర్తపు షాట్ కు క్లాప్ కొట్టారు. అన్నదమ్ముల అనుబంధానికి అద్దం పట్టే ఈ దృశ్యం మెగా అభిమానులకు పూనకాలు తెప్పించింది. ఈ వేదికపై మెగా బ్రదర్ నాగబాబు కూడా సందడి చేయడంతో ‘మెగా త్రయం’ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఇండస్ట్రీని షేక్ చేసింది.
చిరు ఎమోషనల్ !
ఈ క్రేజీ మూమెంట్‌పై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 30 ఏళ్ల నాటి ఒక మధుర జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంటూ.. "ఈరోజు కల్యాణ్ బాబుకి, నాకు మధ్యలో క్లాప్ బోర్డు కనిపిస్తుంటే.. 30 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రివర్స్‌లో జరిగిన సందర్భం గుర్తుకొస్తోంది. డిప్యూటీ సీఎం హోదాలో టైమ్ తీసుకుని, నా 158వ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొని, క్లాప్ కొట్టి అందరినీ ఆనందపరిచినందుకు థాంక్యూ. లవ్ యు కల్యాణ్" అని చిరు ట్వీట్ చేశారు.
అన్నయ్య సినిమాకు క్లాప్
సరిగ్గా 1996లో పవన్ కళ్యాణ్ డెబ్యూ ఫిల్మ్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ప్రారంభోత్సవంలో తమ్ముడి కోసం అన్నగా చిరంజీవి క్లాప్ కొట్టారు. ఇప్పుడు కాలం చక్రం తిప్పింది. ముప్పై ఏళ్ల తర్వాత తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో వచ్చి అన్నయ్య సినిమాకు క్లాప్ కొట్టడం ఒక హిస్టారికల్ మూమెంట్‌గా నిలిచిపోయింది.
►ALSO READ | రామ్ పోతినేని పెద్ద మనసు.. అరుదైన వ్యాధితో పోరాడుతున్న అభిమాని ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్!
క్రేజీ కాంబో..!
KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి రాక్‌స్టార్ ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ ప్రెస్టీజియస్ మూవీ రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచే హైదరాబాద్‌లో శరవేగంగా ప్రారంభం కానుంది. బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసేందుకు మెగాస్టార్ మళ్లీ రెడీ అయిపోయారు..
ఈ రోజు కళ్యాణ్ బాబుకి, నాకు మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే…
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 21, 2026
30 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రివర్స్‌లో జరిగిన సందర్భం గుర్తుకు వస్తోంది - “ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి “
ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో
టైమ్ తీసుకుని వచ్చి, నా 158వ సినిమా ముహూర్తంలో పాల్గొని, క్లాప్ ఇచ్చి… pic.twitter.com/HGBENbRtlp
