టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వెండితెరపైనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ "ఇస్మార్ట్" అనిపించుకున్నారు. రీసెంట్‌గా ఆయన చేసిన ఒక గుండెను హత్తుకునే పని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. గత 18 ఏళ్లుగా ‘ఫ్రీడ్రిచ్ అటాక్సియా’ అనే అరుదైన జన్యుపరమైన నరాల వ్యాధితో పోరాడుతున్న తన వీరాభిమాని కలను రామ్ నిజం చేశారు. ఎలాంటి హడావుడి లేకుండా, నేరుగా ఆమె ఇంటికే వెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చారు.
యువతి కల నిజం చేసిన రామ్..
తన అభిమాన హీరోను ఒక్కసారైనా కలవాలని ఆ యువతి ఎంతో కాలంగా కోరుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న రామ్ వారి ఇంటికి నేరు వెళ్లారు. ఆమెతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడి, ధైర్యం చెబుతూ, ఫొటోలు దిగారు. ఈ యువతి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ అరుదైన వ్యాధి వల్ల శరీర కదలికలు కష్టమైనా, రామ్‌ను చూడాలనే ఆమె సంకల్పం గెలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. అటు రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ హీరో అంటూ నెటిజన్లు రామ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
►ALSO READ | ఆ నాలుగు గోడల మధ్య అసలేం జరిగింది? ఒళ్లు గగుర్పొడిచే ‘మైఖేల్ జాక్సన్: ది వర్డిక్ట్’ ట్రైలర్ అవుట్!
డైరెక్టర్‌గా రామ్ వైల్డ్ ఎంట్రీ..
ఇక సినిమాల విషయానికొస్తే, రామ్ కెరీర్‌లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఆయన తన 23వ చిత్రం (#RAPO23) కోసం తొలిసారి మెగా ఫోన్ పట్టనున్నారు. రామ్ హీరోగా నటిస్తూ, ఆయనే స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు 'ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వోల్ఫ్' అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్ పెట్టారు. రామ్ సోదరుడు కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.
'వీర' లెవెల్ మేకోవర్!
ఈ సినిమాలో రామ్ 'వీర' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. దీనికోసం ఆయన మునుపెన్నడూ లేని విధంగా ఒక సాలిడ్ వైల్డ్ మేకోవర్ అయ్యారు. ఇదొక హై-వోల్టేజ్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ నుంచే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సెట్స్‌పైకి వెళ్లనుంది. అంతేకాదు, ఈ ఏడాది డిసెంబర్‌లోనే ఈ సినిమాను థియేటర్లలోకి తెచ్చేందుకు పక్కా ప్లాన్ చేశారు. సరికొత్త కథతో, డైరెక్టర్‌గా రామ్ చేస్తున్న ఈ సరికొత్త ప్రయోగం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Tollywood actor Ram Pothineni showed his kind-hearted nature
— Telangana Ahead (@telanganaahead) May 21, 2026
Fulfilling the dream of a die-hard fan battling the rare disease ‘Friedreich’s Ataxia’ for 18 years, Ram personally visited her home, spent time with her, and offered emotional support. #RamPothineni #Tollywood pic.twitter.com/7Fge86Xk58
