ఆ నాలుగు గోడల మధ్య అసలేం జరిగింది? ఒళ్లు గగుర్పొడిచే ‘మైఖేల్ జాక్సన్: ది వర్డిక్ట్’ ట్రైలర్ అవుట్!

ఆ నాలుగు గోడల మధ్య అసలేం జరిగింది? ఒళ్లు గగుర్పొడిచే ‘మైఖేల్ జాక్సన్: ది వర్డిక్ట్’ ట్రైలర్ అవుట్!

పాప్ సామ్రాజ్యానికి తిరుగులేని రారాజుగా, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది గుండెల్లో నిలిచిపోయిన లెజెండ్ మైఖేల్ జాక్సన్ (MJ). ఆయన డ్యాన్స్ స్టెప్పులకు ఫిదా అవ్వని వారు ఉండరు. అయితే, కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఆయన చుట్టూ ముసిరిన వివాదాలు, సంచలన కోర్టు కేసులు కూడా అంతే పాపులర్ అయ్యారు.. ఇప్పుడు సరిగ్గా ఆ డార్క్ చాప్టర్‌నే టార్గెట్ చేస్తూ నెట్‌ఫ్లిక్స్ ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్‌తో అభిమానుల ముందుకు వచ్చింది.

డాక్యు-సిరీస్..

అప్పట్లో ప్రపంచాన్ని కుదిపేసిన పిల్లల లైంగిక వేధింపుల కేసు బ్యాక్‌డ్రాప్‌లో ‘మైఖేల్ జాక్సన్: ది వర్డిక్ట్’ అనే సంచలన డాక్యు-సిరీస్  నెట్‌ఫ్లిక్స్ రూపొందించింది. లేటెస్ట్ గా ఈ సిరీస్  ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాను ఈ ట్రైలర్ షేక్ చేస్తుంది. దీంతో ఈ సిరీస్ పై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.

కోర్టులో అసలేం జరిగింది?

2003లో మైఖేల్ జాక్సన్‌పై మోపబడిన ఆరోపణలు, ఆ తర్వాత 2005లో సాగిన సుదీర్ఘ కోర్టు విచారణ ఒక పెద్ద హై డ్రామా. చివరికి జాక్సన్ నిర్దోషిగా తేలినప్పటికీ, ఆ వివాదం ఇప్పటికీ రగులుతూనే ఉంది. ఈ మూడు భాగాల డాక్యు-సిరీస్ ప్రత్యేకత ఏంటంటే... అప్పట్లో కోర్టు రూమ్‌లోకి కెమెరాలకు అస్సలు అనుమతి లేదు. కాబట్టి, ఆ నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో మీడియా తమకు నచ్చినట్లు ముక్కలు ముక్కలుగా చూపించింది. కానీ ఈ సిరీస్‌లో, ఆ కేసును అత్యంత క్లోజ్‌గా చూసిన జ్యూరీ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు, బాధితులుగా చెప్పుకున్న వారు, అలాగే జాక్సన్ తరపున పోరాడిన వారి రియల్ ఇంటర్వ్యూలతో నిజా నిజాలను కళ్లకు కట్టబోతున్నారు.

క్రేజీ టైమింగ్‌లో డాక్యుమెంటరీ!

ప్రస్తుతం థియేటర్లలో మైఖేల్ జాక్సన్ బయోపిక్ మూవీ ‘మైఖేల్’ ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఎమ్‌జే మానియాతో ప్రపంచం ఊగిపోతున్న ఇలాంటి క్రేజీ టైమింగ్‌లో నెట్‌ఫ్లిక్స్ ఈ వివాదాస్పద డాక్యుమెంటరీని తీసుకురావడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. డేవిడ్ హెర్మన్ షోరన్నర్‌గా వ్యవహరించిన ఈ సిరీస్‌ను నిక్ గ్రీన్ డైరెక్ట్ చేశారు. ఫియోనా స్టౌర్టన్, జేమ్స్ గోల్డ్‌స్టన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. క్యాండిల్ ట్రూ స్టోరీస్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది.

ALSO READ : వెకేషన్‌లో నయన్–విఘ్నేశ్ జంట..

ఈ సరికొత్త ఇన్వెస్టిగేటివ్ విజువల్ వండర్ జూన్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కింగ్ ఆఫ్ పాప్ లైఫ్‌లోని అత్యంత వివాదాస్పదమైన, రహస్యమైన ఆ కోర్టు రూమ్ డ్రామాను క్లియర్ కట్‌గా చూడాలంటే జూన్ 3 వరకు వెయిట్ చేయాల్సిందే మరి.