కోలీవుడ్ క్యూట్ కపుల్ నయనతార-విఘ్నేశ్ శివన్ వెకేషన్‌కు వెళ్లారు. తమ ముద్దుల కవల పిల్లలు ఉయిర్, ఉలగంతో కలిసి వాటికన్ సిటీ నగరంలో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రిప్‌కు సంబంధించిన అందమైన ఫోటోలను నయన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, అందులో వారి రొమాంటిక్ మరియు ఫ్యామిలీ మూమెంట్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.
ప్రేమ, ఆశీర్వాదాలతో నిండిన తమకు ఇష్టమైన ప్రదేశం వాటికన్ సిటీ అని నయన్ వెల్లడించింది. ఇక స్టైల్ విషయంలో కూడా ఈ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నయన్ స్టైలిష్ లుక్‌తో బ్లాక్ డ్రెస్సులో మెరిసింది. విఘ్నేష్ శివన్ సింపుల్ కార్గో ప్యాంట్, షర్ట్‌తో క్యాజువల్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ అందమైన ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘పర్ఫెక్ట్ ఫ్యామిలీ గోల్స్’ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
#WikkiNayanFamily 🤍🖤🇮🇹 pic.twitter.com/a51JpOwgLZ
— Nayanthara✨ (@NayantharaU) May 20, 2026
షేర్ చేసిన ఫోటోల్లో నయన్–విఘ్నేశ్ జంట చేతిలో చేయి వేసుకుని నడుస్తూ కనిపించారు. మరో ఫోటోలో విఘ్నేశ్ ప్రేమగా నయనతారను హత్తుకున్న క్షణం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇక పిల్లలు ఉయిర్, ఉలగంతో కలిసి గడిపిన క్యూట్ మూమెంట్స్ ఫోటోలకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చాయి. తల్లిదండ్రులుగా పిల్లలతో కలిసి సరదాగా గడుపుతున్న ఈ జంటను చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
🇮🇹🏃🏻 pic.twitter.com/0wOlTEUz7I
— Nayanthara✨ (@NayantharaU) May 19, 2026
‘ప్రేమకు అందమైన నిర్వచనం ఇదే’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే.. విఘ్నేశ్ శివన్‌ను నయనతార ప్రేమించి 2022 జూన్ 9న మహాబలిపురంలో పెళ్లి చేసుకుంది. సినిమా షూటింగ్స్, బిజీ షెడ్యూల్స్ మధ్య కాస్తా విరామం తీసుకుని తరుచూ వెకేషన్స్ ఎంజాయ్ చేస్తుంటుంది ఈ జంట.
►ALSO READ | Trisha: సూర్యతో సక్సెస్ సెలబ్రేషన్స్.. విజయ్‌తో లింక్స్? త్రిష ‘మ్యాజికల్ మే’ క్యాప్షన్ వెనుక అసలు రహస్యం అదేనా?
నయనతార సినిమాల విషయానికి వస్తే.. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో బడా ప్రాజెక్ట్స్ చేస్తోంది. అన్నీ ఇండస్ట్రీల టాప్ హీరోస్ తో హీరోయిన్ గా నటిస్తూ వెండితెరపై బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం తెలుగు & హిందీలో వంశీ పైడిపల్లి-సల్మాన్ మూవీలో నటిస్తోంది. కన్నడలో టాక్సిక్, మలయాళంలో కొత్త దర్శకులు సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్ దర్శకత్వంలో డియర్ స్టూడెంట్స్ అనే చిత్రంలో నటిస్తోంది. విగ్నేష్ ఇటీవలే లైక్ మూవీతో వచ్చి హిట్ కొట్టాడు. ప్రస్తుతం కొత్త కథ పనిలో ఉన్నాడు.
And it official 🔥 #NayantharaWithSalmanKhan
— Nayanthara✨ (@NayantharaU) March 31, 2026
a @directorvamshi film 🎥 pic.twitter.com/q1hnerNxny
