Trisha: సూర్యతో సక్సెస్ సెలబ్రేషన్స్.. విజయ్‌తో లింక్స్? త్రిష ‘మ్యాజికల్ మే’ క్యాప్షన్ వెనుక అసలు రహస్యం అదేనా?

Trisha: సూర్యతో సక్సెస్ సెలబ్రేషన్స్.. విజయ్‌తో లింక్స్? త్రిష ‘మ్యాజికల్ మే’ క్యాప్షన్ వెనుక అసలు రహస్యం అదేనా?

నటి త్రిష క్రిష్ణన్ పేరు వింటేనే చాలు సౌత్ సినిమా లవర్స్‌కి ఒక ఎనర్జీ వస్తుంది. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఈ చెన్నై చంద్రం దూసుకుపోతుంది. ఇటీవల ఈ బ్యూటీ తెగ వార్తల్లో నిలుస్తోంది. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఒక రేంజ్ హల్‌చల్ చేస్తోంది. తన లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో నెట్టింట ఒక పెద్ద తుఫానే సృష్టించింది.

'కరుప్పు' వసూళ్ల వేట..

టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో, సూర్య హీరోగా వచ్చిన 'కరుప్పు' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 160 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.  ఈ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ.. కో-స్టార్ సూర్యతో కలిసి దిగిన కొన్ని క్రేజీ బిహైండ్ ది సీన్స్ (BTS) ఫోటోలు, వీడియోలను త్రిష షేర్ చేసింది. అయితే, ఇక్కడ అసలు ట్విస్ట్ ఫోటోల్లో లేదు... ఆమె పెట్టిన క్యాప్షన్‌లో ఉంది.

నెటిజన్ల మైండ్ బ్లాక్ చేసిన ఆ ఒక్క లైన్!
"My magical May said one more for the win. Just God things #Karuppu" – అంటూ త్రిష పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు కోలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సింపుల్ లైన్‌కు ఫ్యాన్స్ రకరకాల అర్థాలు తీస్తున్నారు. కొందరేమో 'పొన్నియిన్ సెల్వన్ 1, 2', 'లియో', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాల తర్వాత త్రిష ఖాతాలో పడిన మరో బిగ్గెస్ట్ హిట్ ఇదేనని, అందుకే "వన్ మోర్ ఫర్ ద విన్" అని పెట్టిందని సంబరపడుతున్నారు. కానీ, మెజారిటీ నెటిజన్లు మాత్రం దీని వెనుక ఒక 'పొలిటికల్ , పర్సనల్' సీక్రెట్ ఉందని గట్టిగా నమ్ముతున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trish (@trishakrishnan)

 

విజయ్ వైపే అందరి చూపు..
తమిళ స్టార్, ప్రస్తుత తమిళనాడు రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిన సీఎం విజయ్  వైపే ఈ హింట్ వెళ్తోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. గతంలో 'గిల్లి', 'తిరుపాచి', 'ఆది', 'కురువి', రీసెంట్‌గా 'లియో' చిత్రాలతో ఈ ఇద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ ఎంతగా పీక్స్‌కు వెళ్ళిందో తెలిసిందే. అంతే కాదు విజయ్-త్రిష కలిసి ఇటీవల ఒక వెడ్డింగ్ రిసెప్షన్ కు వెళ్లడం వీరి మధ్య సంబంధం ఉందంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. విజయ్ తో సంగీత విడాకులకు త్రిష కారణం అంటూ పుకార్లు వచ్చాయి.

ALSO READ : ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ 'కర'..

అయితే  ఇప్పుడు త్రిష పెట్టిన 'మ్యాజికల్ మే' అనే పదం కేవలం సినిమా సక్సెస్ గురించేనా? లేక విజయ్ రాజకీయ ప్రస్థానంలో జరిగిన కీలక పరిణామానికి సంకేతమా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా, త్రిష తన సింగిల్ పోస్ట్‌తో అటు సినిమా ఇండస్ట్రీని, ఇటు పొలిటికల్ సర్కిల్స్‌ని ఒకేసారి షేక్ చేసిందని చెప్పాలి..