Kara OTT Release : ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ 'కర'.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

Kara OTT Release : ఓటీటీలోకి ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ 'కర'.. ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'కర'. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 30, 2026న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది. 'పోర్ తోళిల్' వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన విగ్నేష్ రాజా దర్శకత్వంలో  ఈ చిత్రాన్ని తెరక్కించారు. అయితే, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రావడంతో  కమర్షియల్ ఫెయిల్యూర్ దిశగా పయనిస్తోంది.

బాక్సాఫీస్ వద్ద పరాజయం

సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మించిన 'కర', ఇండియాలో కేవలం 37.42 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే రాబట్టగలిగింది. అంటే పెట్టిన పెట్టుబడిలో కేవలం 37 శాతం మాత్రమే వెనక్కి వచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. తమిళ వెర్షన్ వసూళ్లు కూడా రోజురోజుకూ పడిపోతున్నాయి. కేవలం 10 లక్షల కంటే తక్కువ కలెక్షన్లతో 'కర' ప్రస్థానం దాదాపు ముగిసిందనే చెప్పాలి.

ఓటీటీలోకి రెడీ..

థియేటర్లలో బోల్తా పడిన 'కర', ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి దక్కించుకుంది.  లేటెస్ట్  సమాచారం ప్రకారం, ఈ సినిమా మే 28, 2026న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ALSO READ : ‘పెద్ది’ ఢిల్లీ ఎపిసోడ్.. ‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు ఎక్కువ..

ఫ్యాన్స్ ఆశలు ఆవిరి..

ఈ మూవీలో ధనుష్‌తో పాటు మమితా బైజు హీరోయిన్‌గా నటించగా, జయరామ్, కె.ఎస్. రవికుమార్ కీలక పాత్రల్లో కనిపించారు.  జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ, శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ కావడంతో ధనుష్ అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు. థియేటర్లలో మెప్పించలేకపోయిన 'కర', ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. విగ్నేష్ రాజా తన రెండో సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ, ఓటీటీ వేదికగా ఈ చిత్రం మరోసారి చర్చకు వచ్చే అవకాశం ఉంది.