రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ జూన్ 4న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తిచేసుకున్న పెద్ది, వరుస అప్డేట్స్, ప్రమోషన్స్ తో దూసుకెళ్తోంది. ఇటీవల ట్రైలర్, శనివారం మే23న స్పెషల్ సాంగ్, ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ వంటి కార్యక్రమాలతో రచ్చ చేస్తోంది. ప్రమోషన్స్లో భాగంగా పెద్ది మేకర్స్ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు.
డైరెక్టర్ బుచ్చిబాబు, హీరో రామ్ చరణ్ ఇద్దరు కలిసి కార్ డ్రైవ్ చేస్తూ నిర్వహించిన ఇంటర్వ్యూను అభిమానులతో పంచుకున్నారు. ‘పెద్ది జ్ఞాపకాల నడుమ ప్రయాణం’ అంటూ చెర్రీ బుచ్చిలు మాట్లాడుకున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పెద్దిలో నచ్చిన ఎపిపోడ్స్, బాడీ ట్రాన్సఫర్మేషన్, తీసుకున్న నిర్ణయాలు, చేసిన సాహసాలు అన్నీటిపై మాట్లాడుకున్నారు.
ముఖ్యంగా ‘‘ఢిల్లీ ఎపిసోడ్ ఇష్టమైన పార్ట్ అంటూ చరణ్ చెప్పిన విధానం ఆడియన్స్లో అంచనాలు పెంచింది. ఇలా ‘పెద్ది’ మొత్తంలో ఎక్కువ మలుపులు ఉండేది ఆ ఎపిసోడ్‌లో అని చెర్రీ ట్విస్ట్ ఇచ్చాడు. ఇన్నాళ్లు కుస్తీ బరిలో, క్రికెట్ గ్రౌండ్ లోనే అసలు రచ్చ అనుకున్నారు అందరూ. కానీ, ఉప్పెనలో ట్విస్ట్ కంటే 100రెట్లు ఎక్కువ ఉంటుంది ఎపిసోడ్ ’’ అని చరణ్ చెప్పడంతో పెద్దిపై క్యూరియాసిటీ పెరిగింది. ఒక స్టార్ హీరోకి అలాంటి ట్విస్ట్ పెట్టడం చాలా అరుదు సార్. కానీ, ఆ ట్విస్టుతోనే 50 రేట్లు హీరోయిజం కనిపిస్తుంది అని బుచ్చిబాబు అన్నారు. నేలమీద కూర్చుని 2 గంటల 45 నిమిషాల పాటు చెప్పిన పెద్ది కథ ఇండియన్ హిస్టరీలో మైల్ స్టోన్ గా ఉంటుందని చరణ్ బదులిచ్చాడు
ALSO READ : స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా దుల్కర్ సల్మాన్..
అలాగే, కమర్షియల్ యాంగిల్ ఆలోచించకుండా, పెద్ది కోసం రాసిన కథ, చెప్పిన విధానం చాలా నచ్చిందంటూ బుచ్చిబాబుపై చరణ్ ప్రశంసలు కురిపించారు. అలాగే, పెద్దిగాడి క్యారెక్టర్లో ఉన్న నిజాయితీ వీపరీతంగా నచ్చిందని.. ఏదీ ఏమైనా జీవితంలో ముందుకు సాగి వెళ్లాలనే బిగ్గెస్ట్ పాయింట్కు ఫిదా అయినట్లు చరణ్ తెలిపారు.
ఇదే సమయంలో, చరణ్ మాట్లాడుతూ.. పెద్దిగాడు ఇన్ని ఆటలు ఎందుకు ఆడుతున్నాడు.. అసలు క్రాస్ ఓవర్ అథ్లెటిక్స్ అంటే ఏంటో చెప్పిన శైలి అదిరిపోయిందని అన్నారు. ప్రస్తుతం ఈ క్రేజీ వీడియో సోషల్ మీడియాలో వీపరీతంగా వైరల్ అవుతుంది. ఈ క్రమంలో చరణ్–బుచ్చిబాబు మధ్య ఉన్న బాండింగ్కి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
