I Am Game: స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా దుల్కర్ సల్మాన్.. యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

I Am Game: స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా దుల్కర్ సల్మాన్.. యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ప్రస్తుత ఆయన నటిస్తున్న మోస్ట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఐ యామ్ గేమ్’ (I Am Game).  ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుంచి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ వచ్చేసింది.  ఈ సినిమాను ఓనమ్ పండగ కానుకగా ఆగస్టు 20, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన సరికొత్త పోస్టర్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

దుల్కర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ..

‘కింగ్ ఆఫ్ కోత’ తర్వాత దుల్కర్ సల్మాన్ పూర్తిస్థాయి మలయాళ చిత్రంలో నటిస్తుండటంతో అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. పైగా ఇది దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 40వ మైల్‌స్టోన్ చిత్రం. తన కెరీర్‌లోనే అత్యంత స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ రోల్‌ను ఇందులో ప్లే చేస్తున్నట్లు దుల్కర్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. సౌత్ ఇండియాలోని దాదాపు 100కు పైగా రియలిస్టిక్ లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిపారు. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ సహా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

‘ఆర్డీఎక్స్’ డైరెక్టర్ మార్క్ యాక్షన్..

గతంలో ‘RDX’ లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన సెన్సేషనల్ డైరెక్టర్ నహాస్ హిదాయత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే బ్లాక్‌బస్టర్ సినిమా ‘లోక’ను అందించిన వేఫేరర్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ అత్యంత భారీ ఖర్చుతో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో ఆంటోనీ వర్గీస్ పెపే, ఐశ్వర్య లక్ష్మి, తమిళ్ స్టార్ డైరెక్టర్ మిస్సిన్, కతీర్, కాయాదు లోహర్, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మాసివ్ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ అయిన అన్బరివ్ మాస్టర్స్ పనిచేస్తుండగా.. జేక్స్ బిజోయ్ అద్భుతమైన మ్యూజిక్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానున్న ఈ ‘ఐ యామ్ గేమ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.