వావ్.. మంగళవారం తగ్గిన గోల్డ్.. హైదరాబాదులో గ్రాము రేటు ఎంతంటే..?

వావ్.. మంగళవారం తగ్గిన గోల్డ్.. హైదరాబాదులో గ్రాము రేటు ఎంతంటే..?

ఇరాన్ అమెరికా మధ్య చర్చలు ముందుకువెళుతున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మార్కెట్లతో పాటు బులియన్ మార్కెట్లు కూడా సానుకూలంగా ముందుకు సాగుతున్నాయి. దీంతో రిటైల్ మార్కెట్లలో కూడా బంగారం, వెండి ధరలు ప్రభావితం అవుతున్నాయి. ఈ క్రమంలో షాపింగ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లోని రిటైల్ విక్రయ ధరలను పరిశీలించటం చాలా ముఖ్యం. 

ఆగస్టు 4న బంగారం రేట్లు తగ్గాయి. ఆగస్టు 3 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.22  తగ్గుముఖం పట్టింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 400గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 200గా కొనసాగుతోంది. 

ALSO READ : ఎలక్ట్రిక్ కార్లు యమ కొంటుర్రు.. జులైలో సేల్స్ 82 శాతం జంప్

మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఆగస్టు 4, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 35వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.235 దగ్గర ఉంది.