ఇవాళ రేపు ఏది కల్తీ సరుకేదో, అసలేదో గుర్తుపట్టలేనంతగా అయిపోయింది పరిస్థితి. అల్లంపేస్ట్ మొదలుకొని...పొద్దున లేవగానే వాడే టూత్ పేస్ట్, వంటింట్లో వాడే మసాలాల వరకు ప్రతిదీ కల్తీ చేసేస్తున్నారు కేటుగాళ్లు. హైదరాబాద్ లో ఇవాళ ( ఆగస్టు 4 ) బయటపడిన కల్తీ మసాలా బాగోతంతో బయట షాపులో మసాలాలు కొనాలంటేనే వణికిపోయే పరిస్థితి తలెత్తింది.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 టన్నుల కల్తీ మసాలాలు సీజ్ చేశారు H ఫాస్ట్ అధికారులు. నిత్యం వంటల్లో వంటల్లో లవంగం దగ్గర నుంచి సోంపు, షాజీరా వరకు అన్నిటిని కల్తీ చేసేస్తున్నారు కేటుగాళ్లు. ఈ క్రమంలో కల్తీ మసాలాలను ఇట్టే కనిపెట్టచ్చని అంటున్నారు సీపీ సజ్జనార్... అదెలాగో ఇప్పుడు చూద్దాం..
- ముందు రెండు గ్లాసుల్లో నీళ్లు తీసుకోండి.
- ఇంట్లో దంచుకున్న మసాలాను ఒక గ్లాసులో వేయండి
- మరొక గ్లాసులో షాపు నుంచి తెచ్చిన మసాలాను వేయండి
- నీళ్ల గ్లాసులో మసాలా వేసాక రంగు మారకకుండా యధాతధంగా ఉంటే అది అసలైన మసాలా..
- మసాలా గ్లాసులో వేసిన కొన్ని సెకన్లకే నీళ్ల రంగు మారితే అది కల్తీ మసాలా అని గుర్తించండి.
ఇలా.. ఇక మీదట బయట కిరాణా షాపు నుంచి మసాలా కొంటే...ఈ చిన్న టెస్ట్ తో కల్తీ ఏదో, అసలు ఏదో గుర్తించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.షాపుల్లో కొన్న వస్తువు ఏదైనా కల్తీ అన్న అనుమానం వస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు H ఫాస్ట్ అధికారులు. కల్తీ బారినపది ఆరోగ్యం చెడగొట్టుకునేకంటే... మసాలాలు మన ఇంట్లోనే తయారు చేసుకోవడం బెటర్ అని గుర్తించండి.
