Peddi First Review: రామ్ చరణ్ ‘పెద్ది’ సెన్సార్ టాక్ లీక్.. మూవీ రన్‌టైమ్ ఎంతంటే?

Peddi First Review: రామ్ చరణ్ ‘పెద్ది’ సెన్సార్ టాక్ లీక్.. మూవీ రన్‌టైమ్ ఎంతంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా అంచనాలు తారాస్థాయికి చేరాయి. లేటెస్ట్ గా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ రావడమే కాకుండా, సినిమా చూసిన ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న రిపోర్ట్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మెగా విధ్వంసం ఖాయంగా కనిపిస్తోంది.

‘రంగస్థలం’ తర్వాత ఆ స్థాయి ఇంటెన్సిటీ!

సాధారణంగా ఈ రోజుల్లో కమర్షియల్ సినిమాలు రెండున్నర గంటల లోపే ముగుస్తుంటాయి. కానీ ‘పెద్ది’ మాత్రం ఏకంగా 3 గంటల 9 నిమిషాల (189 నిమిషాల) సుదీర్ఘ రన్‌టైమ్‌తో లాక్ అయింది. ‘రంగస్థలం’ తర్వాత చరణ్ కెరీర్‌లో ఇంత భారీ నిడివితో వస్తున్న సినిమా ఇదే. ఇటీవల ‘పుష్ప 2’ లాంటి చిత్రాలు భారీ రన్‌టైమ్‌తోనే సంచలనాలు సృష్టించిన నేపథ్యంలో, బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ కథలోని ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులను ప్రతి సెకన్ సీటు అంచున కూర్చోబెడతాయని మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

1980ల నాటి కుస్తీ బరి..!

1980ల నాటి గ్రామీణ నేపథ్యం, నాటి మనుషుల పంతాలు, పట్టింపులు, ముఖ్యంగా కుస్తీ (రెజ్లింగ్) క్రీడ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ పాత్ర కోసం రామ్ చరణ్ తన శరీరాకృతిని మరింత ఆకట్టుకునేలా మార్చేశారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లలో ఆయన రస్టిక్ వింటేజ్ లుక్, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్ చూసి సెలబ్రిటీలతో పాటు అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, గుండెల్ని పిండేసే బలమైన సెంటిమెంట్ ఈ సినిమాలో హైలైట్ కానుందని టాక్.

►ALSO READ | Rashmika: కృతి సనన్‌‌పై రష్మిక బోల్డ్ కామెంట్స్.. సెన్సార్ చెయ్యండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్!

గ్లోబల్ రేంజ్‌లో..

వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీశ్ కిలారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయట. జాన్వీ కపూర్ పల్లెటూరి పడచుగా చరణ్ సరసన ఒదిగిపోయింది. జూన్ 4న థియేటర్లు స్టేడియంలుగా మారడం.. రికార్డుల వేట మొదలవడం ఖాయం అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.  మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.