Chiranjeevi: మెగాస్టార్ కెరీర్‌లోనే 'బ్లడీ బెంచ్‌మార్క్'.. పూనకాలు తెప్పిస్తున్న బాబీ మాస్ జాతర గ్లింప్స్!

Chiranjeevi: మెగాస్టార్ కెరీర్‌లోనే 'బ్లడీ బెంచ్‌మార్క్'..  పూనకాలు తెప్పిస్తున్న బాబీ మాస్ జాతర గ్లింప్స్!

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వేటకు మళ్లీ రెడీ అయ్యారు. 'వాల్తేరు వీరయ్య'తో థియేటర్లలో పూనకాలు తెప్పించిన మెగాస్టార్- డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్, ఇప్పుడు మరోసారి థీయేటర్లు దద్దరిల్లేలా షేక్ చేయడానికి సిద్ధమైంది. వీరిద్దరి క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #Mega158 (వర్కింగ్ టైటిల్). కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

హైదరాబాద్‌లో సరికొత్త హంగామా..

ఇటీవలే ప్రకృతి అందాల నిలయం పొల్లాచ్చిలో ఒక సుదీర్ఘమైన, కీలకమైన షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. అక్కడ మెగాస్టార్‌పై కొన్ని మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు ముఖ్యమైన టాకీ పార్ట్‌ను కూడా చిత్రీకరించారు. దీనికి సంబంధించిన ఒక అదిరిపోయే గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. దీంతో మెగాభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.

►ALSO READ | ముంబైలో శ్రీలీలకు ఘోర అవమానం? అసలేం జరిగిందంటే..!

లేటెస్ట్ గా, ఈ చిత్రం సోమవారం నుండి హైదరాబాద్‌లో సరికొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఈ షెడ్యూల్ అత్యంత ఎక్స్‌ప్లోజివ్ గా ఉండబోతోందని చిత్ర బృందం హింట్ ఇచ్చింది. ఒక వినూత్నమైన ఊరగాయల తయారీ బ్యాక్‌డ్రాప్ ఉన్న లొకేషన్‌లో చిరుతో పాటు చిత్ర ప్రధాన తారాగణంపై కీలకమైన సీన్లు తీస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీస్ అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కూడా పాల్గొన్నారు.

'బ్లడీ బెంచ్‌మార్క్' గ్యారెంటీ!

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి రెండు విభిన్నమైన కోణాలున్నపాత్రలో కనిపించబోతున్నారట. బాబీ మార్క్ వింటేజ్ చిరు ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ కానున్నాయి.  ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు చూసుకుంటున్నారు. చిరు కెరీర్‌లోనే ఇదొక ‘బ్లడీ బెంచ్‌మార్క్ మాస్ యాక్షన్ ఫిల్మ్ కాబోతోంది. మరి ఈ మెగా తుఫాన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తుడిచిపెట్టేస్తుందో చూడాలి.