ముంబైలో శ్రీలీలకు ఘోర అవమానం? అసలేం జరిగిందంటే..!

 ముంబైలో శ్రీలీలకు ఘోర అవమానం? అసలేం జరిగిందంటే..!

నెట్టింట ప్రస్తుతం ఒక వీడియో తెగ హల్ చల్ చేస్తోంది. టాలీవుడ్ డ్యాన్స్ క్వీన్ శ్రీలీల‌కు ముంబైలో అవమానం జరిగిందంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. లేటెస్ట్ గా ( జూన్ 21న )  ముంబైలోని ఎస్‌వీపీ స్టేడియంలో 'దివ్యాజ్ ఫౌండేషన్' ఆధ్వర్యంలో అమృతా ఫడ్నవీస్ నేతృత్వంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఈవెంట్‌కు బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, జాకీ ష్రాఫ్‌లతో పాటు  టాలీవుడ్ క్రష్ శ్రీలీల కూడా స్పెషల్ గెస్ట్‌గా హాజరైంది.

శ్రీలీల ఫ్యాన్స్ ఫైర్.. అసంలేం జరిగిందంటే?

అయితే, ఈ వేడుక ముగిసిన తర్వాత జరిగిన ఒక ఘటన ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. స్టేజీపై ఫొటో సెషన్ జరుగుతుండగా.. అమృతా ఫడ్నవీస్, ఆమె కుమార్తె దివిజలతో కలిసి శ్రీలీల ఫొటోలకు పోజులిచ్చింది. సరిగ్గా అదే సమయంలో అమృతా ఫడ్నవీస్, శ్రీలీలను పక్కకు తప్పుకోవాలంటూ చేత్తో సైగ చేయడం కెమెరాలకు చిక్కింది. దాంతో శ్రీలీల కాస్త అసహనంగానే అక్కడి నుంచి పక్కకు జరిగి కూర్చుంది.. ఈ చిన్న క్లిప్ కాస్తా సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో శ్రీలీల ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. స్టార్ హీరోయిన్‌ని అంత దూరం పిలిపించి, అందరి ముందు అలా ఫ్రేమ్ లోంచి వెళ్ళిపోమనడం ఎంతవరకు న్యాయం? ఇది ముమ్మాటికీ అమృతా ఫడ్నవీస్ అహంకారానికి నిదర్శనం అంటూ నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు.

అసలు ట్విస్ట్ ఏంటంటే..

ఈ వివాదంపై మరో వర్గం నెటిజన్లు, అమృత మద్దతుదారులు భిన్నంగా స్పందిస్తున్నారు. అక్కడ శ్రీలీలను అవమానించాలనే ఉద్దేశం ఎవరికీ లేదని క్లారిటీ ఇస్తున్నారు.  ఫొటోలు తీస్తున్న సమయంలో ఒక మరాఠీ ఫొటోగ్రాఫర్.. అమృత , మీ అమ్మాయి కాంబినేషన్‌లో మాత్రమే విడిగా కొన్ని ఫొటోలు కావాలి అని కోరాడట.  ఆ రిక్వెస్ట్ విన్న తర్వాతే అమృత.. శ్రీలీలను కాస్త పక్కకు జరగమని అడిగారని, ఆ తర్వాత తల్లీకూతుళ్లు ఇద్దరే ఫొటోలకు పోజులిచ్చారని చెబుతున్నారు. ఫొటోలు అయిపోయాక ఓకేనా? బాగా వచ్చాయా? అని అమృత ఫోటోగ్రాఫర్లను అడగడం కూడా వీడియోలో వినిపిస్తోంది.

►ALSO READ | Janhvi Kapoor: నేను తప్పిపోతే నన్ను నా ప్రియుడు శిఖర్ కు అప్పగించండి.. లవ్‌ను కన్ఫర్మ్ చేసిన జాన్వీ కపూర్!.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అయిన అమృతా ఫడ్నవీస్ కేవలం మీడియా రిక్వెస్ట్ మాత్రమే ఫాలో అయ్యారని కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరేమో కారణం ఏదైనా, ఒక సెలబ్రిటీని అలా పక్కకు నెట్టేయడం కరెక్ట్ కాదు అని వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇష్యూపై అటు శ్రీలీల కానీ, ఇటు అమృత కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి ఈ క్రేజీ కాంట్రవర్సీకి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి..