OTTలోకి మెగాస్టార్.. త్వరలోనే అదిరిపోయే అప్డేట్!

OTTలోకి మెగాస్టార్.. త్వరలోనే అదిరిపోయే అప్డేట్!

కొరోనా తరువాత ఎంటర్టైన్మెంట్ వేస్ పూర్తిగా మారిపోయాయి. అప్పటివరకు థియేటర్స్ మాత్రమే ఉండేవి.. కొరోనా తరువాత ఓటీటీల హవా మొదలైంది. ఆడియన్స్ కూడా ఓటీటీ కంటెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేయడం మొదలుపెట్టేశారు. ఒకానొక సమయంలో థియేటర్స్ ఉనికి ఉండదేమో అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. అంతలా ఎంటర్టైన్మెంట్ రంగాన్ని ప్రభావితం చేసింది ఓటీటీ బెల్ట్. ప్రస్తుత సినిమాల బిజినెస్ లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి ఓటీటీ సంస్థలు.

 అందుకే థియేటర్స్ కు ధీటుగా కొత్త కొత్త కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి. ఇందుకోసం టాప్ స్టార్స్ ను సైతం రంగంలోకి దించుతున్నాయి. ఇప్పటికే చాలా మంది హిందీ స్టార్స్ ఓటీటీ కంటెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు కానీ, తెలుగు స్టార్స్ మాత్రం అంతంగా ఆసక్తి చూపించడం లేదు. అందుకే తెలుగులో కూడా ఓటీటీ హవా కొనసాగించడానికి ముందుకు వచ్చింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌. ఇందులో భాగంగానే ఆ సంస్థ సీఈవో టెడ్ సరండోస్ ఇటీవల మెగా ఫ్యామిలీని కలిసిన విషయం తెలిసిందే. 

ఈ సందర్బంగా తమ సంస్థలో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు మెగాస్టార్ చిరంజీవిని ఒప్పించాడట టెడ్ సరండోస్. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకు సంబందించి కథా చర్చలు కూడా ఇప్పటికే ముగిశాయని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. ఇక ఈ ప్రాజెక్టును ఎవరు డైరెక్ట్ చేస్తారు అనే డీటెయిల్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. మరి థియేటర్స్ లో దుమ్ము లేపిన చిరు.. ఓటీటీ కోసం ఎలాంటి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తారో? ఆయన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.