హనుమాన్ మేకర్స్ మధ్య రెమ్యూనరేషన్ చిచ్చు.. ప్రశాంత్ పోస్ట్ వైరల్

హనుమాన్ మేకర్స్ మధ్య రెమ్యూనరేషన్ చిచ్చు.. ప్రశాంత్ పోస్ట్ వైరల్

హనుమాన్(HanuMan) మేకర్స్ మధ్య గొడవలు. రెమ్యునరేషన్ విషయంలో మొదలైన వివాదం. నెక్స్ట్ ప్రాజెక్టు నుండి తప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prashanth Varma). ఇవి గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్. ఈ న్యూస్ చూసిన ఆడియన్స్ సైతం అవాక్కాయ్యారు. నిన్నమొన్నటివరకు బాగానే ఉన్నారు కదా! ఇంతలోనే ఎం జరిగింది? మరి జై హనుమాన్ సినిమా ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఇదే విషయంపై దర్శకుడు ప్రశాంత్ వర్మ సైతం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా కేవలం రూ.40 కోట్లతో తెరకెక్కి రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. నిజానికి హనుమాన్ మేకర్స్ కూడా ఈ సినిమా ఈ రేంజ్ విషయం సాదిస్తుందని ఊచించలేదు. దాంతో వసూళ్ళలో వాటాలు, రెమ్యునరేషన్, నెక్స్ట్ సినిమాకు సంబందించిన బడ్జెట్ విషయాల్లో నిర్మాత నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ వర్మ మధ్య గోడలు వచ్చాయని వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలు ప్రశాంత్ వద్దకు చేరడంతో తాజాగా పీక్ పిక్ తో సమాధానం చెప్పారు ప్రశాంత్. 

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హనుమాన్ ఓవర్ సీస్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత నిరంజన్ రెడ్డితో నవ్వతూ దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ఆ హనుమంతుని స్పూర్తితో మాపై వస్తున్న నెగిటివిటీని తుడిపేస్తున్నాము.. అంటూ రాసుకొచ్చాడు. దీంతో వారి మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చేశాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ప్రశాంత్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.