గల్ఫ్ లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు ఎత్తేయాల్సిందే.. లేదంటే అటాక్ చేస్తూనే ఉంటాం.. ఇది ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఫస్ట్ రియాక్షన్. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత కొత్తగా అపాయింట్ అయిన మొజ్తాబా ఖమేనీ.. చాలా రోజులుగా మౌనం వహిస్తూ.. గురువారం (మార్చి 12) తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా అమెరికా, ఇజ్రాయెల్ సహా వాటి మిత్ర దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఖమేనీ స్టేట్మెంట్స్:
- హర్మూజ్ జలసంధి మేసే ఉంటుంది
- మిత్ర దేశాలతో స్నేహం కొనసాగుతుంది
- కానీ అమెరికాతో అంటకాగితే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది
- పశ్చిమాసియాలో ఉన్న అమెరికా ఆర్మీ బేస్ క్యాంపులను ఎత్తేయాలి
- లేదంటే వాటిపైన మరింత తీవ్రంగా దాడి చేస్తాం
- సైనిక స్థావరాలు మూసేవరకు టార్గెట్ చేస్తూనే ఉంటాం
- హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేసే ప్రాంతాన్ని వాడుకుంటూ యుద్ధంలో పైచేయి సాధిస్తాం
- గల్ఫ్ దేశాలు అమెరికా మిలిటరీ బేస్ లను మూసివేయాలి
- లేదంటే మా ఫస్ట్ టార్గెట్స్ అవే అవుతాయి
ఆయతొల్లా ఖమేనీపై జరిగిన దాడిలో ఆయన కుమారుడైన మొజ్తాబా ఖమేనీ గాయపడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇన్నాళ్లుగా మౌనంగా ఉన్న ఆయన తొలిసారి ఇరాన్ ప్రజలను ఉద్దేశించి సందేశం పంపారు. అదే విధంగా అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలు, పొరుగు దేశాలకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఖమేనీ పంపిన సందేశాన్ని ఇరాన్ ప్రభుత్వ టీవీలో న్యూస్ ప్రజెంటర్ చదివి వినిపించారు.
