సాధ్వి సీత పాత్రకు సాయి పల్లవి కంటే ఈమెనే బెటర్ అని రచ్చ.. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరంటే..

సాధ్వి సీత పాత్రకు సాయి పల్లవి కంటే ఈమెనే బెటర్ అని రచ్చ.. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరంటే..

నమిత్ మల్హోత్రా నిర్మాతగా నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రామాయణ. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం ట్రైలర్ విడుదలైంది. అయితే.. ఈ ట్రైలర్పై నెట్టింట దుమారం రేగుతుంది. సీత పాత్రలో సాయి పల్లవి ఏమాత్రం గొప్పగా లేదని, సీత పాత్రకు సాయి పల్లవి కంటే ఆమె పక్కన కనిపించిన అమ్మాయి బాగుంటుందని ఎవరికి వాళ్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఈమెనే బెటర్ అని ఈ ట్రైలర్లోని ఒక సన్నివేశాన్ని స్క్రీన్ షాట్ తీసి నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. సాయి పల్లవి పక్కన ఉన్న ఆ యువతి సాయి పల్లవిని పూర్తిగా డామినేట్ చేసిందని.. ఆ యువతిపై కెమెరా ఫోకస్ లేకపోయినా ఆమె అందంగా కనిపించిందని కొందరు నెటిజన్లు పోస్టులు పెట్టారు. దీంతో.. ‘రామాయణ’ సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవి అపీయరెన్స్పై నెట్టింట చర్చ మొదలైంది.

జస్ట్ సాయి పల్లవి పక్కన నిల్చుని, ట్రైలర్లో ఒక్క షాట్లో కనిపించి ఇంతగా చర్చకు దారితీసిన ఈ అమ్మాయి ఎవరంటే.. ఆమె పేరు సురభి దాస్. అస్సాంకు చెందిన ఈ యువ నటి ‘రామాయణ’ కంటే ముందు నిమా డెంజోంగ్పా అనే టీవీ షోలో లీడ్ రోల్లో చేసింది. ఈ టీవీ షో ఎపిసోడ్స్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ ‘రామాయణ’ సినిమాలో సీత చెల్లెలు శ్రుతకీర్తి పాత్రలో ఆమె నటించింది. అస్సోంకు చెందిన సురభి దాస్కు ఇన్ స్టాగ్రాంలో 9 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

►ALSO READ | OTT Thriller: థియేటర్లలో మిస్ అయ్యారా? ఐతే ఈ తెలుగు సైకాలజికల్ థ్రిల్లర్ మీ కోసమే

రామాయణ సినిమాలో సాయి పల్లవి సీతాదేవి పాత్రను పోషిస్తున్నప్పటికీ.. నటి సురభి దాస్ అందం నెటిజన్లను ఆకర్షించింది. ట్రైలర్లో భారతీయ కట్టుబొట్టులో ఆమె కనిపించిన తీరు మంత్ర ముగ్ధులను చేసింది. ఆమెను చూసిన అభిమానులు పూర్తిగా విస్మయం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను ఒక్క సన్నివేశంతో ఈ సురభి దాస్ కొల్లగొట్టింది. అయితే.. ఆమెపై ప్రశంసల వరకూ ఆగకుండా పనిలో పనిగా సాయి పల్లవిపై విమర్శలు చేస్తుండటంతో ఈ వైరల్ పోస్టులు సరికొత్త వివాదానికి దారితీశాయి.

సాయి పల్లవి కంటే ముందు టాలీవుడ్లో సీత పాత్రలో కనిపించిన వాళ్లతో పోల్చుతూ ఆమెను విమర్శిస్తున్న వాళ్లు లేకపోలేదు. అయితే.. ఒక పాత్రకు ఎవరిని ఎంచుకోవాలనేది పూర్తిగా దర్శక నిర్మాతల నిర్ణయం. ఆ పాత్రకు తగిన అందం, అభినయం ఉన్నాయని దర్శకుడు భావిస్తేనే సాయి పల్లవికి సీత పాత్ర దక్కింది.

ట్రైలర్లో కనిపించిన ఒకటి, రెండు సన్నివేశాలను చూసి సీత పాత్రకు సాయి పల్లవి ఎంపిక సరైన నిర్ణయం కాదని విమర్శించడం సమంజసం కాదని సాయి పల్లవి అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. ఇదే ట్రైలర్లోని కొన్ని సన్నివేశాల్లో సాయి పల్లవి ఎంతో చూడ ముచ్చటగా ఉందని వాదిస్తున్నారు. మొత్తంగా రామాయణ ట్రైలర్.. సీతారాముల పాత్రలకు నటీనటుల ఎంపికపై మరోసారి ఆసక్తికర చర్చకు తావిచ్చింది.