ఇట్స్ ఆఫీసియల్!..మెగాస్టార్ 156 టైటిల్ లీక్

ఇట్స్ ఆఫీసియల్!..మెగాస్టార్ 156 టైటిల్ లీక్

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా, బింబిసారా దర్శకుడు వశిష్ట (Vassishta) డైరెక్షన్ లో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. మెగా156 (Mega156) అనే వర్కింగ్ టైటిల్ తో వస్తోన్న ఈ పాన్ ఇండియా మూవీని యూవీ క్రియేషన్స్(UV Creations) సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..చిరంజీవి మెగా156 మూవీ టైటిల్ లీకైంది. స్క్రిప్ట్ బుక్కి సంబంధించిన మొదటి పేజీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందు నుంచి వినిపిస్తోన్న 'విశ్వంభర’ (Viswambhara) అనే టైటిల్‍ను మేకర్స్ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. లీకైన ఫొటోలో..యూవీ క్రియేషన్స్ పేరుతో పాటు..డైరెక్టర్ వశిష్ఠ పేరు కూడా ఉండటంతో..విశ్వంభర టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే కనిపిస్తోంది. ఇక అన్నయ్య చిరంజీవి టైటిల్ ఇదేనంటూ..మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా షేర్ చేస్తున్నారు. 

మేకర్స్ నుంచి అఫిషియల్ టైటిల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. దీంతో త్వరలో టైటిల్ ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం లీకైన స్క్రిప్ట్ బుక్ ఫోటో..చిరు లీకుల్లో భాగంగా బయటికి వచ్చిన ఫోటో అన్నట్టు టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో చిరు సరసన అనుష్క, మృణాల్ నటిస్తోన్నట్టు సమాచారం. అలాగే చిరుకి విలన్ గా హీరో రానా నటిస్తారని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తుంది. 

మైథలాజికల్ జానర్ లో రానున్న ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్ తోనే..మెగా ఫ్యాన్స్ కు హై లెవెల్ హోప్స్ ఇచ్చారు డైరెక్టర్. ఇలా రిలీజైన ప్రతి పోస్టర్ లో మెగా మాస్..బియాండ్ యూనివర్స్ అనే క్యాప్షన్ ఇస్తూ వస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

ALSO READ : ట్రాక్ ఎక్కిన అమర్ గేమ్.. గెలిచి సత్తా చాటాడు.. పొగడ్తలతో ముంచెత్తిన శివాజీ