మరో మూడు సినిమాలను సెట్ చేసిన మెగాస్టార్.. ఇది నెక్స్ట్ లెవల్ లైనప్

మరో మూడు సినిమాలను సెట్ చేసిన మెగాస్టార్.. ఇది నెక్స్ట్ లెవల్ లైనప్

భోళా శంకర్(Bhola shankar) సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). కనీసం మెగా ఫ్యాన్స్ కూడా మెప్పించలేకపోయింది ఈ సినిమా. దీంతో తన తరువాత సినిమాలపై ఫోకస్ పెట్టారు చిరు. భోళా శంకర్ విషయంలో జరిగిన పొరపాటును మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఆచి తూచి ప్రాజెక్టులను ప్లాన్ చేసుకుంటున్నారు. 

ఇప్పటికే తన పుట్టినరోజు సందర్బంగా రెండు సినిమాలను అనౌన్స్ చేసిన మెగాస్టార్.. ఇప్పుడు మరో మూడు సినిమాలను లైన్లో పెట్టారు. అందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా ఒకటి కాగా.. గీత ఆర్ట్స్ లో మరో సినిమా చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కు మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించనున్నారు. ఈ రెండు సినిమాలే కాకుండా.. స్టార్ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో కూడా ఓ సినిమా చేసేందుకు ఒకే చెప్పేశారట చిరు. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కు సంబందించిన కథా చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. ప్రస్తుతం చిరు ఒకే చేసిన రెండు సినిమాలు కంప్లీట్ అయినా వెంటనే ఈ మూడు సినిమాల్లో ఏదో ఒక మూవీ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. అయితే త్వరలోనే ఈ మూడు ప్రాజెక్ట్స్ కు సంబందించిన అధికారిక ప్రకటన రానుందని సంచారం. 

ఇక ప్రస్తుతం చిరు చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. బింబిసారా దర్శకుడు వశిష్టతో మెగా 157 మూవీ చేస్తున్నారు. ఇటీవల అధికారికంగా మొదలైన ఈ ప్రాజెక్టు కు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో రానున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.