రాంచరణ్ రేర్ ఫొటో షేర్ చేసిన మెగాస్టార్

రాంచరణ్ రేర్ ఫొటో షేర్ చేసిన మెగాస్టార్

నేడు మెగాపవర్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు చరణ్‎కు విష్ చేస్తూ ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారు. ఇకపోతే రాంచరణ్ బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఒక రేర్ ఫొటో షేర్ చేశారు. రాంచరణ్‎కి సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ చెప్పటం తనకు వింతగా అనిపిస్తుందని చిరు అన్నారు. అయితే రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా.. చెర్రీ చిన్నప్పటి ఫొటో ఒకటి షేర్ చేస్తే అభిమానులు ఆనందిస్తారని భావించిన ఆయన.. చెర్రీని తన ఒళ్లో కూర్చొబెట్టుకున్న ఫొటో ఒకటి షేర్ చేశారు. కొడుకుగా చరణ్ తనను గర్వపడేలా చేశాడని మెగాస్టార్ ట్వీట్ చేశారు.

కాగా.. తాను నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పట్ల అభిమానులు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు రాంచరణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఈ సినిమా విజయ బహుమానాన్ని బాధ్యతతో స్వీకరిస్తానని చెర్రీ ట్వీట్ చేశారు.

For More News..

ఆగని పెట్రో ధరలు.. ఆరు రోజుల్లో 5 సార్లు పెంపు