ఆగని పెట్రో ధరలు.. ఆరు రోజుల్లో 5 సార్లు పెంపు

ఆగని పెట్రో ధరలు.. ఆరు రోజుల్లో 5 సార్లు పెంపు

పెట్రో ధరల పెంపు వరుసగా కొనసాగుతోంది. ఇవాళ లీటర్ పెట్రోల్ పై 50 పైసలు, డీజిల్ పై 55 పైసలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఆరు రోజుల్లో 5 సార్లు ధరలు పెరిగాయి. హైదరాబాద్‎లో లీటర్ పెట్రోల్ ధర 112 రూపాయల 35 పైసలు, డీజిల్ ధర 98 రూపాయల 68 పైసలుగా ఉంది. ముంబైలో పెట్రోల్ 113 రూపాయల 88 పైసలు, డీజిల్ 98 రూపాయల 13 పైసలకు చేరింది. చెన్నైలో పెట్రోల్ 104 రూపాయల 90 పైసలు, డీజిల్ 95 రూపాయలుగా ఉంది. కోల్ కతాలో పెట్రోల్ 108 రూపాయల 53 పైసలు, డీజిల్ 93 రూపాయల 57 పైసలుగా ఉంది. ఢిల్లీలో పెట్రోల్ 99 రూపాయల 11 పైసలకు, డీజిల్ 90 రూపాయల 42 పైసలకు చేరింది. 

ఈ ఏడాదిలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయిల్ కంపెనీలు ధరలు పెంచలేదు. దీంతో దాదాపు 19 వేల కోట్ల నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. యుద్ధంతో  బ్యారెల్ చమురు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నష్టాలను సర్దుబాటు చేసేందుకు ప్రతి రోజూ ధరలు పెంచుతున్నట్టు సమాచారం. యుద్ధంతోనే పెట్రో ధరలు పెరుగుతున్నాయని కేంద్రం అంటోంది. దాదాపు 80 శాతం చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.

For More News..

ఆర్టీసీ చార్జీలు రూ. 5 నుంచి 14 వరకు పెరిగే చాన్స్