T20 World Cup: విశ్వవిజేతగా భారత్.. వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన టీమిండియా

T20 World Cup: విశ్వవిజేతగా భారత్.. వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన టీమిండియా

T20 World Cup: టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లోభారత్ మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. 40 కోట్ల భారతీయుల ఆశలను నిజం చేస్తూ సూర్య సేన పొట్టికప్పును అందుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 96 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతంగా రాణించి 255 పరుగులు చేశారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. టీమిండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ మ్యాచ్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దీంతో కివీస్ మరోసారి ఫైనల్ లో విఫలమై కప్ ని చేజార్చుకుంది. 

 
టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఫైట్ లో భారత నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా  5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కి వచ్చిన ఇండియన్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ అర్థ శతకాలతో చెలరేగాగా.. చివర్లో శివమ్ దూబే మెరుపు బ్యాటింగ్ చేయడంతో 255 పరుగులు చేసింది భారత్.  

లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ పీకల్లోతూ కష్టాల్లో పడింది. కివీస్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ ఒక్కడే పోరాటం చేయగా.. సీఫెర్ట్ ఒక్కడే 26 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్సులతో 52 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. మిగతా బ్యాటర్లు ఫిన్ అలెన్ (9), రచిన్ రవీంద్ర (1), గ్లెన్ ఫిలిప్స్ (5), మార్క్ చాప్మన్ (3) దారుణంగా విఫలం కాగా.. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన డారెల్ మిచెల్ (17), జేమ్స్ నీషామ్ ( 8), మాట్ హెన్రీ(0) నిరాశ పరిచారు. చివర్లో కెప్టెన్ మిచెల్ శాంటర్న్ (43) కూడా కాసేపు ఒంటరిగా పోరాటం చేసిన ఫలితం దక్కలేదు. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీసుకోగా.. అక్షర్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.