అమెరికాలో సిప్లా క్యాన్సర్ మందు రీకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

అమెరికాలో సిప్లా క్యాన్సర్ మందు రీకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీ సిప్లా అమెరికాలో తన జనరిక్ యాంటీ–క్యాన్సర్ ఔషధం నిలోటినిబ్ క్యాప్సూల్స్ (150 ఎంజీ, 200 ఎంజీ)ను రీకాల్ చేస్తోంది. తయారీ సమస్యల కారణంగా 400కి పైగా కార్టన్లను వెనక్కి పిలిపిస్తోంది. రెగ్యులేటరీ యూఎస్  ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏ రిపోర్ట్ ప్రకారం, ఫెయిలైన ట్యాబ్లెట్లు లేదా క్యాప్సుల్స్ కారణంగా ఈ లాట్లు ప్రభావితమయ్యాయి. సిప్లా ఈ ఏడాది ఫిబ్రవరి 18న క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3 వాలంటరీ రీకాల్ ప్రారంభించింది. 

మందులను  వాడిన తర్వాత ఆరోగ్యానికి తీవ్రమైన హాని లేకపోయినపన్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా ప్రొడక్షన్ ఉంటే క్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3 రీకాల్ జారీ చేస్తారు.  క్యాన్సర్ కణాల పెరుగుదలకి కారణమయ్యే అసాధారణ ప్రోటీన్ చర్యను నిలోటినిబ్ అడ్డుకుంటుంది. వ్యాధి వ్యాప్తిని తగ్గిస్తుంది.  2022లో అమెరికాలో వాడిన మందులలో 40శాతం వరకు భారతీయ కంపెనీలు సరఫరా చేశాయి.