బ్యారల్ 200 డాలర్లకు చేరుతుందా.. ఇరాన్ టార్గెట్ ఇదేనా.. ఆర్థిక సంక్షోభంలోకి ప్రపంచం

బ్యారల్ 200 డాలర్లకు చేరుతుందా.. ఇరాన్ టార్గెట్ ఇదేనా.. ఆర్థిక సంక్షోభంలోకి ప్రపంచం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే అల్లకల్లోలం చేసే దిశగా ఇరాన్ చర్యలు ఉంటుున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగటం ఖాయం అని.. బ్యారల్ 200 డాలర్ల వరకు వెళుతుందని.. ఈ దిశగా మా యాక్షన్ ప్లాన్ ఉందని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. 2026, మార్చి 9వ తేదీ నాటికి.. క్రూడ్ ఆయిల్ బ్యారల్ 115 డాలర్లకు చేరుకుంది. రాబోయే రోజుల్లో.. ఈ నెలలోనే 200 డాలర్ల వరకు వెళుతుందని ఇరాన్ చెప్పటం ఇప్పుడు ప్రపంచ దేశాలను షాక్ కు గురి చేస్తుంది. గల్ఫ్ దేశాలతోపాటు.. ఆయిల్ రవాణాను ఛిన్నాభిన్నం చేయటం ద్వారా.. రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలకు డ్రూల్ ఆయిల్ కొరతతోపాటు.. ఆయిల్ ఉత్పత్తి భారీగా పడిపోవనుంది. ఈ పరిణామాలతో ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ కొరత వచ్చి.. ఆర్థిక వ్యవస్థలు అల్లకల్లోలం అవుతాయి. ఈ లక్ష్యంతోనే అమెరికాకు వార్నింగ్ ఇస్తోంది ఇరాన్..

ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య గత 8 రోజులుగా కొనసాగుతున్న భీకరపోరు ఇప్పుడు ప్రపంచ ఇంధన మార్కెట్లను వణికించే స్థాయికి చేరుకుంది. తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని క్రూడ్, ఇంధన మౌలిక సదుపాయాలపై ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ జరిపిన భారీ దాడులు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ దాడుల వల్ల టెహ్రాన్ అంతటా భారీ మంటలు ఎగిసిపడ్డాయని.. మైళ్ల దూరానికి ఆ పొగ మేఘాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామంపై ఇరాన్ అత్యంత కఠినంగా స్పందిస్తూ.. తమ చమురు క్షేత్రాలపై దాడులు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు బ్యారెల్‌కు ఏకంగా 200 డాలర్లకు చేరుకుంటాయని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

అయితే ఈ దాడులపై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఇజ్రాయెల్ సైన్యం దాడులకు ముందు సమాచారం ఇచ్చినప్పటికీ.. దాడులు జరిగిన తీరు, దాని పరిధి చూసి అమెరికా రక్షణ వర్గాలు కూడా షాక్ అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామం పట్ల నిరాశ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చమురు నిల్వలను కాల్చేయటం కంటే వాటిని రక్షించడమే తమ ప్రాధాన్యతని, ఇటువంటి దాడుల వల్ల ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతుందని ట్రంప్ సలహాదారులు పేర్కొంటున్నారు. ఈ దాడుల తీవ్రతపై వాషింగ్టన్, టెల్ అవీవ్ మధ్య విభేదాలు తలెత్తడం.. అమెరికా అధికారులు ఇజ్రాయెల్‌కు తమ నిరసనను వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్ మాట్లాడుతూ.. తమ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు ఆపకపోతే అదే పని తాము కూడా చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. అదే జరిగితే క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్ ఏకంగా 200 డాలర్లకు చేరుకుంటుందని ఇరాన్ పేర్కొంది. మరోవైపు ఈ ఇంధన డిపోలను ఇరాన్ ప్రభుత్వం తమ సైనిక అవసరాల కోసం వాడుకుంటోందని, అందుకే వాటిని లక్ష్యం చేసుకున్నామని ఇజ్రాయెల్ సమర్థించుకుంటోంది. సాధారణ ఇరాన్ ప్రజలు వాడే వనరులపై దాడులు చేయడం వల్ల అక్కడి ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే ప్రమాదం ఉందని, ఇది వ్యూహాత్మకంగా నష్టమని అమెరికా భావిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ చమురు వ్యాపారానికి కీలకమైన 'హార్ముజ్ జలసంధి' వద్ద ఉద్రిక్తతలు పెరిగితే, గ్లోబల్ ఎనర్జీ సప్లై దెబ్బతినడం ఖాయంగా ట్రంప్ సర్కార్ ఆందోళన చెందుతోంది.