నిర్మల్: బైక్ డివైడర్‌ను ఢీకొని ఇద్దరు యువకులు అక్కడిక్కకడే మృతి చెందారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్ దగ్గర ఆదివారం (మార్చి 8) ఘోర ప్రమాదం జరిగింది. మంజులాపూర్ నుంచి నిర్మల్ వైపు వస్తోన్న బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.
ప్రమదానికి గల కారణాలపై ఆరా తీశారు పోలీసులు. మృతులను మంజులాపూర్‌కు చెందిన సృజన్ (33), నటరాజ్ నగర్‌కు చెందిన పృధ్విరాజ్ (34)గా గుర్తించారు పోలీసులు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
