ఫ్యామిలీ స్టార్ మృణాల్ను .. SVP కీర్తిసురేష్ తో లింక్..ఎందుకో తెలుసా?

ఫ్యామిలీ స్టార్ మృణాల్ను .. SVP కీర్తిసురేష్ తో లింక్..ఎందుకో తెలుసా?

విజయ్ దేవరకొండ (Vijay devarakonda) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ (FamilyStar ). ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ గ్లింప్స్.. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను, ఓ వైపు కుర్రాళ్లను భలే ఆకట్టుకుంటోంది. మధ్య తరగతి కుర్రాడిగా కనిపిస్తోన్న విజయ్ దేవరకొండ లుక్, తెలంగాణ స్లాంగ్లో వచ్చే డైలాగ్స్ టీజర్ కే అట్రాక్షన్ గా నిలిచాయి.

ఉల్లిపాయలు కొంటె ఆడు మనిషి కాదా..పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా..అనే డైలాగ్స్ అయితే.. విజిల్స్ పడేలా ఉన్నాయి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. టీజర్ చివర్లో హీరోయిన్ మృణాల్ ఏవండీ అనే సింపుల్ డైలాగ్..మీమర్స్(Meemars) దృష్టిలో పడింది. 

ఇంతకీ ఈ డైలాగ్ తో మీమర్స్ కు ఏం పని అనుకుంటున్నారా.. అసలు మీమర్స్ ఉన్నదే.. ఏదైనా రిలీజ్ అయితే..అందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ వెతుక్కుని మరి ఎంటర్ టైన్ చేయడానికి. టీజర్లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్( Mrunalthakur) వేసుకున్న డ్రెస్ ని మీమర్స్ చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేసినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండను ట్రోలింగ్ చేయడానికి ఎక్కడ ఛాన్సెస్ లేక.. హీరోయిన్ మృణాల్ తో సరిపెట్టుకున్నారు. 

అసలు పాయింట్కి వస్తే..టీజర్ చివర్లో మృణాల్ ఠాకూర్ వేసుకున్న నైటీ డ్రెస్ మహేష్ బాబు సర్కారువారిపాట (SVP) మూవీలో హీరోయిన్ కీర్తి సురేష్(Keerthysuresh) వేసుకున్న డ్రెస్ ఒకేలా ఉండటంతో..మీమర్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. డైరెక్టర్ పరుశురామ్(Parushuram) తన పాత సినిమాలో డ్రెస్ లని కూడా వాడేస్తూన్నారు.

ALSO READ : అలవాటు పడ్డారు కదా : దసరాకు షాక్ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్

SVP మూవీలో మహేష్ బాబు కు గుమ్మం ముందు హరతీ ఇస్తూ కీరిసురేష్ సింపుల్ రొమాంటిక్ లుక్ తో అట్ట్రాక్ట్ చేసింది. ఇప్పుడు లేటెస్ట్ ఫ్యామిలీ స్టార్ మూవీతో ఏవండీ అంటూ..ఆడియన్స్ను తన బుట్టలో వేసుకునే ప్రయత్నం చేసింది. దీంతో.. ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dilraju)కి బడ్జెట్ సేవ్ చేస్తున్నాడంటూ డైరెక్టర్ పరుశురామ్ పైన కూడా తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. వాస్తవానికి అక్కడ గమనిస్తే..రెండు డ్రెస్ లు ఒకే ఫ్లవర్ డిజైన్స్ తో ఉన్న.. ఒకే మోడల్ అయితే కాదు. 

సహజంగా ఫ్యామిలీ లేడీస్ ఇంట్లో ఖాళీగా టైంలో ఎక్కువగా నైటీలు వేసుకుంటారు కాబట్టి..దానికి సింబాలిక్ గానే మృణాల్ ఠాకూర్ ని నైటీలో చూపించారు డైరెక్టర్. కీర్తి సురేష్ వేసుకున్న కాస్ట్యూమ్ తో పోల్చి చూపిస్తూ ట్రోలింగ్ చేయడంపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హార్ట్ అయినట్లు సమాచారం.

దీంతో మీమర్స్ పైన ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. ఇటువంటి చిన్న చిన్న వాటికి యుద్దాలు అవసరం లేదంటూ.. మధ్యలో నెటిజన్స్ సర్ది చెప్తున్నారు. ఒకరకంగా డైరెక్టర్ ఇలా చేయడం ప్రమోషన్స్ లో భాగమై ఉండొచ్చని సినీ లవర్స్ చెప్తున్నారు.