అలవాటు పడ్డారు కదా : దసరాకు షాక్ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్

అలవాటు పడ్డారు కదా : దసరాకు షాక్ ఇచ్చిన నెట్ ఫ్లిక్స్

ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ ఓ రేంజ్‌లో విస్తరిస్తోంది. కరోనా తర్వాత ఓటీటీ వైపు మొగ్గు చూపుతోన్న వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. అంతేకాదు వారం వారం కొత్త కొత్త కంటెంట్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాయి కూడా. దీంతో ఓటీటీ సంస్థల మధ్య కాంపిటీషన్ పెరిగిపోతోంది. అందులో నెట్‌ఫ్లిక్స్‌(Netflix) ఒకటి.

అయితే దసరా సందర్బంగా కొత్త కంటెంట్ ను ఎంజాయ్ చేద్దాం అనుకున్న యూజర్స్ కు మరో షాకిచ్చింది నెట్‌ఫ్లిక్స్‌. ఇప్పటికే.. పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితిని తీసుకొచ్చిన నెట్‌ఫ్లిక్స్.. మరో షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ మరోసారి సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలను పెంచుతూ ప్రకటన జారీ చేసింది. .

ఇందులో భాగంగా నెట్‌ఫ్లిక్స్‌..  తన ప్రాధమిక ప్లాన్ ధరను నెలకు 9.99 నుండి11.99 డాలర్లుగా.. ప్రీమియం ప్లాన్ ధరను నెలకు 19.99 నుండి 22.99 డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పాస్‌వర్డ్ షేరింగ్‌ కట్టడి తర్వాత నెట్‌ఫ్లిక్స్‌కు సభ్యత్వం పొందిన చాలా మంది యూజర్లు యాడ్-ఫ్రీ ప్లాన్‌లను సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యాడ్స్‌తో కూడిన సబ్‌స్క్రిప్షన్‌ ధర నెలకు 6.99 డాలర్లుగా ఉండగా, యాడ్స్‌ ఫ్రీ ప్లాన్‌ ధర నెలకు 15.49 డాలర్లుగా ఉంది. ఇక ఆదాయం పెంపే లక్ష్యంగా చార్జీలు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.