పాలు కాదు.. పచ్చి విషం ! సబ్బు, ఆయిల్, యూరియాతో పాలు కల్తీ చేస్తున్న గ్యాంగ్.. పట్టించిన స్థానికులు..

పాలు కాదు.. పచ్చి విషం ! సబ్బు, ఆయిల్, యూరియాతో పాలు కల్తీ చేస్తున్న గ్యాంగ్.. పట్టించిన స్థానికులు..

పసిపిల్లల నుండి ముసలివాళ్ల వరకూ పాలు అందరు తాగుతుంటారు. అలంటి పాలనే కల్తీ చేసి సొమ్ము చేసుకుంటుంది ఓ గ్యాంగ్. పాలల్లో మనిషికి హానికరమైన కలపడమే కాకుండా వాటిని మళ్ళి చక్కగా ప్యాకింగ్ చేసి ఎప్పటిలాగే అసలైన పాల ప్యాకెట్ లాగా ఇంటింటికి సప్లయ్ చేస్తున్నారు. ఎవరైనా పాలలో నీళ్లు పోసి కల్తీ చేస్తారు కానీ ఈ గ్యాంగ్ ఒక డెన్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక లీటరు పాలని ఏకంగా రెండు లీటర్లు చేస్తున్నారు. ఈ కల్తీ పాల రాకెట్ ఇప్పుడు పాలు తాగాలంటేనే  భయం పుట్టిస్తుంది. 

ముంబైలోని అంధేరీ వెస్ట్ (కపాస్వాడి) ప్రాంతంలో జరుగుతున్న ఓ భారీ పాల కల్తీ రాకెట్ ను స్థానికులు బయటపెట్టారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. అసలు పాలను కెమికల్స్‌తో ఎలా విషపూరితంగా మారుస్తున్నారో ఈ వీడియోలో బయటపడింది.

సమాచారం ప్రకారం.. ఈ పాల తయారీలో డిటర్జెంట్ పౌడర్, యూరియా, సబ్బు నీళ్లు, రిఫైన్డ్ ఆయిల్ వంటి ప్రమాదకరమైన పదార్థాలను వాడుతున్నారు. అలాగే ఒక లీటరు స్వచ్ఛమైన పాలలో నీళ్లు, రసాయనాలు కలిపి దానిని రెండు లీటర్లుగా మార్చేస్తున్నారు.

 డైరీల నుంచి వచ్చే అసలు పాల ప్యాకెట్లను దారి మళ్లించి, ఒక రహస్య ప్రాంతంలో వాటిని కట్ చేసి కల్తీ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ కొత్త ప్యాకెట్లలో ఈ కల్తీ చేసిన పాలు నింపి ఇంటింటికీ సప్లయ్ చేస్తున్నారు.

►ALSO READ | మద్యం కోసం వెళితే.. నోట్ల కట్టలు బయటపడ్డాయి : డబ్బులను మెషీన్లతో లెక్కపెట్టారు
 
వైద్యుల హెచ్చరిక ప్రకారం ఈ పాలను తాగడం వల్ల కిడ్నీలు,  లివర్  దెబ్బతింటాయి. పిల్లల్లో ఎదుగుదల ఆగిపోతుంది. మహిళల్లో క్యాల్షియం లోపం ఏర్పడుతుంది. కంటి సమస్యలు, చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
 
ఈ వీడియోలో స్థానికులు, పోలీసులు కలిసి కల్తీ జరుగుతున్న ఓ ఇంటిపై దాడి చేశారు. అక్కడ నిందితులు పాలను కల్తీ చేస్తూ రెడ్ హ్యాండ్ గా పట్టుబడ్డారు. ఈ దందా కొన్ని ఏళ్లుగా సాగుతున్నట్లు నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
 
ఇంత జరుగుతున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు (FSSAI), మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తనిఖీలు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.