సూది కోసం సోదికి వెళితే.. గుట్టు అంతా బయటపడినట్లు.. ఆ ఇంట్లో అక్రమ మద్యం ఉందన్న సమాచారంతో వెళ్లిన పోలీసులు షాక్ అయ్యారు. లిక్కర్ బాటిళ్లు అయితే కనిపించలేదు కానీ.. అంతకు మించి వాళ్లకు నోట్ల కట్టలు కనిపించటంతో అవాక్కయ్యారు. ఈ ఘటన మహారాష్ట్ర రాష్ట్రం పూణెలోని కోంధ్వా అనే ఏరియా జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కొంధ్వా ఏరియాలో హౌస్ కం షాపు నిర్వహిస్తున్న ఓ వ్యాపారి ఇంట్లో అక్రమ మద్యం ఉందన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఇళ్లంతా తనిఖీ చేయగా.. బెడ్ రూంలోని కప్ బోర్డ్స్ లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే కనిపించాయి. ఇల్లు వెతికే కొద్దీ నోట్ల కట్టలు బయటపడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే విషయం పెద్దది అవుతుందని.. ఇది చాలా పెద్ద అమౌంట్ అన్న ఉద్దేశంతో ఇన్ కం ట్యాక్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు పోలీసులు.
అలా విషయం తెలిసిందే లేదో.. ఇన్ కం ట్యాక్స్ అధికారులు వాహనాల్లో స్పాట్ కు వచ్చారు. వస్తూ వస్తూ డబ్బులు లెక్కపెట్టే మెషీన్లు కూడా తెచ్చారు. ఇళ్లంతా సోధించి.. బయటకు తీసిన నోట్ల కట్టలను మెషీన్లతో లెక్కించగా.. కోటి రూపాయలపైనే ఉన్నట్లు తేలింది.
►ALSO READ | ఇండియన్స్‌ని డిపోర్ట్ చేయటంలో అమెరికాను దాటేసిన సౌదీ.. ఆ తప్పుల వల్లనే..!
దేనికోసం అయితే పోలీసులు వెళ్లారో.. ఆ మద్యం మాత్రం కేవలం జస్ట్ 2 లక్షల రూపాయల విలువైన మద్యం మాత్రమే దొరికింది అంట.. కోటి రూపాయలకు పైగానే డబ్బు పోవటం ఆ వ్యాపారిని మరింత బాధకు గురి చేసిందంట. ఇక పోలీసులు అయితే ఇల్లీగల్ లిక్కర్ కోసం వెళితే.. కోట్ల రూపాయల డబ్బు బయటపడటం వాళ్లకీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదిఏమైనా సూది కోసం సోదికి వెళితే అన్న సామెతగా.. పాపం ఆ వ్యాపారి దాచుతున్న నోట్ల కట్టలు అంతా ఇప్పుడు ప్రభుత్వం ఎత్తుకెళ్లింది. అక్రమ మద్యం కేసు మాత్రమే కాదు.. అక్రమంగా దాచిన డబ్బు కేసు కూడా నమోదైంది అంట..
महाराष्ट्र के पुणे के कोंढवा इलाके में अवैध शराब व्यापार के ख़िलाफ़ पुलिस ने बड़ा अभियान चलाया। इस दौरान एक करोड़ से ज्यादा की नकदी जब्त की गई। साथ ही 3 लोग भी गिरफ्तार हुए हैं। #Pune #रेड #Maharashtra #maharashtranews pic.twitter.com/8Onr3hiJYq
— SANJAY TRIPATHI (@sanjayjourno) December 26, 2025
