"ఉదయం10 గంటలకు" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. 

"ఉదయం10 గంటలకు" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. 

హెబ్బా  పటేల్, చైతన్య రావు, అభినవ్ గోమటం,  కిరీటి దామరాజు, వాసు ఇంటూరి, సాహితి అవంచ, మోహిత్ ప్రధాన పాత్రల్లో  ‘ఓ పిట్ట కథ’ ఫేమ్ చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘రేపు ఉదయం 10 గంటలకు’.  మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామ్ వీరపనేని నిర్మిస్తున్నారు.  మంగళవారం ఫస్ట్‌‌‌‌లుక్ పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు. 

ఇందులో ఆర్టిస్టులను చూపిస్తూ బ్యాక్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌లో పెద్ద గడియారాన్ని హైలైట్‌‌‌‌ చేయడం ఆసక్తిని పెంచుతోంది.  వీటి వెనుక కథ తెలియాలంటే టీజర్, ట్రైలర్ విడుదల వరకు వెయిట్ చేయాలి. 

ఇప్పటికే షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని మేకర్స్ చెప్పారు.  త్వరలోనే  రిలీజ్ డేట్‌‌‌‌ను ప్రకటించనున్నారు. ప్రిన్స్ ఈ  చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.