T20 World Cup: ఇంగ్లాండ్‌ను ఓడిస్తే క‌ప్పు టీమిండియాదే.. ఎలాగో తెలుసా?

T20 World Cup: ఇంగ్లాండ్‌ను ఓడిస్తే క‌ప్పు టీమిండియాదే.. ఎలాగో తెలుసా?

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026 చివరి అంకానికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఇప్పటికే సెమీఫైనల్‌కు సైతం చేరుకున్నాయి. రేపు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న తొలి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా–న్యూజిలాండ్ టీమ్స్ పోటీపడనున్నాయి. గురువారం నాడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్–ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీస్ జరగనుంది. సెమీస్‌లో విజేతలుగా నిలిచిన టీమ్స్ మార్చి 8వ తేదీన జరిగే ఫైనల్‌లో ట్రోఫీ కోసం పోటీ పడతాయి.

టైటిల్ వేటలో భారత్– ఇంగ్లాండ్: 
ఐసీసీ టోర్నమెంట్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ఇండియా– ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్ దశలో ఇప్పటి వరకు నాలుగు సార్లు పోటీ పడ్డాయి. 1983 వన్డే ప్రపంచకప్, 1987 వన్డే వరల్డ్ కప్, 2022  పోటీ కప్, 2024 టీ20 ప్రపంచకప్‌లలో ఈ రెండు టీమ్స్ సెమీఫైన్ లో పోటీపడ్డాయి. ఇందులో రెండు సార్లు భారత్, రెండు సార్లు ఇంగ్లాండ్ ట్రోఫీని కైవంస చేసుకున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీన జరిగే మ్యాచ్ ఇరు జట్ల మధ్య ఐదో సెమీఫైనల్ కానుంది.

43 ఏళ్ల క్రితం తొలి ఘట్టం: 
1983 వన్డే ప్రపంచకప్ సెమీస్ లో టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ తొలిసారి పోటీ పడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 60 ఓవర్లలో 213 రన్స్ చేసి ఆలౌటైంది. ఆ తర్వాత కపిల్ దేవ్ నాయకత్వంలోని ఇండియా జట్టు 54.4 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది. ఆ సెమీఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత ఫైనల్‌లో వెస్టిండీస్‌ను ఓడించి భారత్ తొలి ప్రపంచ కప్‌ను దక్కించుకుంది. 

►ALSO READ | IPL 2026: బెంగళూరులో ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ.. ఆర్సీబీ హోంగ్రౌండ్లోనే  ప్లేఆఫ్స్, ఫైనల్

ఇంగ్లాండ్‌పై గెలిస్తేనే టైటిల్:  
1987 వన్డే వరల్డ్ కప్, 2022 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లలో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ఇక 2024 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో టీమిండియా– ఇంగ్లాండ్‌పై గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆ తర్వాత జరిగిన ఫైనల్‌లో రోహిత్ శర్మ సౌతాఫ్రికా టీమ్ ని ఓడించి టీ20 ప్రపంచకప్‌ను హస్తగతం చేసుకుంది.  దీంతో ఈసారి సెమీస్ లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించి మరోసారి భారత్‌ టైటిల్ దక్కించుకునే అవకాశాలు మరింత బలపడతాయని ఇండియన్ క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.