ఇరాన్‌ పై దాడికి వ్యతిరేకంగా..ఢిల్లీలో వామపక్ష పార్టీల నిరసన

ఇరాన్‌ పై దాడికి వ్యతిరేకంగా..ఢిల్లీలో వామపక్ష పార్టీల నిరసన

న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా, -ఇజ్రాయెల్ దాడి.. ఇరాన్​సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యకు వ్యతిరేకంగా వామపక్షాలు మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఈ సందర్భంగా సీపీఎం నాయకురాలు బృందా కారత్ మాట్లాడుతూ.. ‘‘ఇరాన్‌పై దాడులపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు?. ఆయన ఇజ్రాయెల్ నుంచి తిరిగి వచ్చిన 24 గంటల్లోనే ఇరాన్‌పై దాడి జరిగింది. మీరు యుద్ధానికి ఆమోదముద్ర వేయడానికే అక్కడికి వెళ్లారా?" అని ఆమె ప్రశ్నించారు.  

సీపీఐ(ఎం‌ఎల్) లిబరేషన్ జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య మాట్లాడుతూ.. భారత ప్రజలు ఈ యుద్ధాన్ని కోరుకోవడం లేదన్నారు. భారత ప్రభుత్వం యుద్ధాన్ని ఆపి, శాంతిని పునరుద్ధరించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎం‌ఎల్) లిబరేషన్, ఆర్‌ఎస్‌పీ), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) తదితర పార్టీలు పాల్గొన్నాయి.