మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ 4.3 తీవ్రతతో నమోదు అయింది. భూమి కంపించడంతో జనం భయంతో ఇండ్లనుంచి బయటకు పరుగులు పెట్టారు. నాసిక్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ భూకంపం సంభవించింది. భూకంప ధాటికి నాసిక్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఇళ్లకు పగుళ్లు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం లేదని ప్రకటించారు.
జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (NCS) ప్రకారంప.. శనివారం రాత్రి 10 గంటల సమయంలో 4.3 తీవ్రతతో భూకంప తీవ్రత నమోదు కాగా.. ఆదివారం ఉదయం 5.30 గంటలకు రిక్టర్ స్కేల్ పై 3.3తీవ్రతతో భూమి కంపించింది. మహారాష్ట్ర, గుజరాత్ సరిహద్దు వెంబడి ఉన్న హత్ గడ్ పర్వత శ్రేణి సమీపంలోని భాన్వాడ్ ప్రాంతంలో 5 కిలోమీటర్ల లోతుతో భూకంప కేంద్రం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
నాసిక్ సిటీతోపాటు సుర్గానా, కల్వాన్, డియోలా, చంద్వాడ్, పేఠ్, దిండోరి, నిఫాఢ్ ప్రాంతాలు సహా నాసిక్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించడంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. సుర్గానా ప్రాంతంలో ఇళ్ల గోడలుపగుళ్లు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.
ఈ భూకంపంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రాజెక్టులకు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అంతకుముందు జూలై 25 నుంచి 28 వరకు ,ఆగస్టు 6న కూడా ఈ జిల్లాలో భూకంప ప్రకంపనలు నమోదు అయ్యాయని NCS తెలిపింది.
EQ of M: 4.3, On: 08/08/2026 22:00:59 IST, Lat: 20.424 N, Long: 73.682 E, Depth: 5 Km, Location: Nashik, Maharashtra.
— National Center for Seismology (@NCS_Earthquake) August 8, 2026
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @DrNKalaiselvi @GSuresh_NCS @ndmaindia pic.twitter.com/4fwyQRouS7
