రిటైర్మెంట్ తర్వాత ఎన్ని కోట్లు సంపాదించినా మైదానంలో వచ్చే ఆ కిక్ మరెక్కడా దొరకదు.. 

రిటైర్మెంట్ తర్వాత ఎన్ని కోట్లు సంపాదించినా మైదానంలో వచ్చే ఆ కిక్ మరెక్కడా దొరకదు.. 

ఈ తరం క్రికెట్ అభిమానులకు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) అగ్రెసివ్, ఆటిట్యూడ్ గురించి పూర్తిగా తెలియకపోవచ్చు.. కానీ, ఒకప్పుడు ఆయనే ఇండియన్ క్రికెట్‌కి రియల్ దాదా. మైదానంలో విదేశీ జట్లకు ఎదురెళ్లి నిలబడటం, మాటకు మాట బదులివ్వడం నేర్పించిన ధీరుడు. అలాంటి క్రికెట్ దిగ్గజం ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో చేసిన ఎమోషనల్ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఎంత ఆస్తి పాస్తులు ఉన్నా, క్రికెట్ ఇచ్చే కిక్ ముందు ఏదీ సరిపోదని ఆయన చెప్పిన సత్యం ఫ్యాన్స్ హృదయాలను తాకుతోంది.

కోట్లు ఉన్నా ఆ ఫీలింగ్ రాదు: 

క్రికెట్ నుంచి తప్పుకున్నాక వచ్చే సంపాదన, జీవితం గురించి సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. మీరు క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తి కూడబెట్టినా.. మైదానంలో మ్యాచ్ ఆడుతున్నప్పుడు కొట్టే ఓ పర్ఫెక్ట్ కవర్ డ్రైవ్, లేదా బ్యాట్ మధ్యలో బాల్ తగిలినప్పుడు (Sweet spot) వచ్చే ఫీలింగ్ జీవితంలో మరెక్కడా రాదని స్పష్టం చేశారు.

* ఆత్మసంతృప్తికి మించిన కిక్ లేదు: ఒక ప్లేయర్‌కు మైదానంలో తాను కొట్టే అద్భుతమైన షాట్ లేదా వేసే వికెట్ టేకింగ్ డెలివరీ ఇచ్చే ఆత్మ సంతృప్తిని ప్రపంచంలో ఏ సంపదా ఇవ్వలేదన్నాడు.

* గాడ్ ఆఫ్ ది ఆఫ్ సైడ్: గంగూలీ ఆఫ్ సైడ్‌లో కొట్టే డ్రైవ్‌లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండేది. ఆఫ్ సైడ్‌లో ఎంతమంది ఫీల్డర్లను ఉంచినా వారి మధ్య నుంచి గ్యాప్ వెతికి కవర్ డ్రైవ్ కొట్టడంలో ఆయన తోఫు.. అందుకే ఆయన్ని 'గాడ్ ఆఫ్ ది ఆఫ్ సైడ్' అని పిలుస్తారు. 

* దిగ్గజాలకు సైతం వర్తించే నిజం: గంగూలీ చెప్పిన ఈ మాట సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. రిటైర్మెంట్ తర్వాత వ్యాపారాలు, ప్రకటనల ద్వారా కోట్లు ఆర్జించినా మైదానంలో పొందే ఆ స్పెషల్ మజాను వేటితోనూ భర్తీ చేయలేరు.