న్యూఢిల్లీ: డీప్‌ఫేక్ కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మెటాను ఆదేశించింది. భారత చట్టాల ప్రకారం ఇంటర్మీడియరీ నిబంధనలను మెటా పాటిస్తుందా లేదా అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. భారత చట్టాల ప్రకారం ఇంటర్మీడియరీ నిర్వచనానికి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు సరిపోతున్నాయా అనే అంశంపైనా ఆయా సంస్థల నుంచి వివరణ కోరనున్నాయి.
యూజర్లకు ఏ కంటెంట్ చూపించాలనే దానిపై ప్లాట్‌ఫామ్‌లకు నియంత్రణ ఉంటే, వాటి పాత్ర ‘పబ్లిషింగ్’ కిందకు వస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అప్పుడు ఆయా ప్లాట్‌ఫామ్‌లలో జరిగే కంటెంట్‌కు, చర్యలకు ఆ సంస్థలదే పూర్తి బాధ్యతని స్పష్టం చేశాయి. కాగా, డీప్‌ఫేక్‌లు, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ (సీఎస్‌ఏఎం), లేబుల్ చేయని సింథటిక్ కంటెంట్‌పై మెటా తీసుకోబోయే చర్యలను కేంద్రానికి వివరించింది.
డీప్‌ఫేక్‌లు, సీఎస్‌ఏఎం,బాట్ అకౌంట్లను ఎదుర్కొనే పరిష్కారాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని ప్లాట్‌ఫామ్‌లలో ఎలా అమలు చేయవచ్చో మెటా వివరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
