‘టీచ్ ఫర్ ఛేంజ్’ కార్యక్రమానికి రండి.. మంత్రి సీతక్కకు సినీనటి మంచు లక్ష్మి ఆహ్వానం

‘టీచ్ ఫర్ ఛేంజ్’ కార్యక్రమానికి రండి.. మంత్రి సీతక్కకు సినీనటి మంచు లక్ష్మి ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని ప్రజాభవన్‌‌ లో మంగళవారం రాష్ట్ర పంచాయతీ రాజ్​శాఖ మంత్రి సీతక్కను సినీనటి, టీచ్ ఫర్ ఛేంజ్ ట్రస్ట్ ఫౌండర్ మంచు లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 27న నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. 

ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను మంత్రికి వివరించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధనకు సహకారం అందిస్తున్నామని, స్కూళ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పేద విద్యార్థుల చదువు కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమని మంచు లక్ష్మిని మంత్రి అభినందించారు.