- బీజేపీ నేత దేవకీ వాసుదేవరావు
హైదరాబాద్, వెలుగు: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలోని భూదాన్ భూములపై అధికార పార్టీ నేతలుకన్నేశారని, అందుకే కోర్టు ధిక్కారానికి పాల్పడి మరీ పేదల ఇండ్లను కూల్చివేశారని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు రేట్లు పెరగడంతో పేదలను వెళ్లగొట్టి, ఆ భూములను కాజేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని కేటీఆర్.. ఇప్పుడు ఖమ్మం వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. వెలుగుమట్ల భూదాన్ భూములపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
