ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో విద్యుత్ కనెక్షన్ లేని అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా కనెక్షన్లు అందిస్తున్నామని జిల్లా ఎస్ఈ ఉత్తమ్ జాడే తెలిపారు. ఇప్పటివరకు 80 అంగన్వాడీ కేంద్రాలకు కనెక్షన్లు మంజూరు చేశామని చెప్పారు. విద్యుత్ కనెక్షన్లు, అంతర్గత వైరింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఇది పూర్తిగా ఉచితమని తెలిపారు. చిన్నారుల కోసం నిర్వహించే ప్రీ -స్కూల్ కార్యకలాపాలు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య సేవలు సజావుగా సాగేందుకు విద్యుత్ సౌకర్యం దోహదం చేస్తుందన్నారు.
విద్యుత్ సౌకర్యంతో అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటార్లు తదితర పరికరాలు సక్రమంగా పనిచేయడంతో పిల్లలు సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించగలుగుతారని పేర్కొన్నారు.
