రోడ్డు ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ

రోడ్డు ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ

రేవల్లి, వెలుగు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చీర్కపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి కేశవులు కుటుంబాన్ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం పరామర్శించారు. ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌‌‌‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేశవులు భార్య వనజను ఎమ్మెల్యే కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

కేశవులు మరణం ఆ కుటుంబానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సర్పంచ్ పగుడాల రవి సమక్షంలో బాధిత కుటుంబానికి రూ. 10 వేల తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేశారు.