హైదరాబాద్, వెలుగు: పెట్ కేర్ బ్రాండ్ జిగ్లీ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తమ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో మూడో 'ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే' వేడుకలు ఘనంగా నిర్వహించింది. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది పెట్ పేరెంట్స్ తమ పెంపుడు జంతువులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. పెంపుడు జంతువులకు ఉచిత హెల్త్ చెకప్‌లు, వెటర్నరీ వైద్యుల ఉచిత సలహాలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక చికిత్స అందించేలా 'పెట్ ఫస్ట్ ఎయిడ్' శిక్షణ నిర్వహించారు. దేశంలోని 15కి పైగా నగరాల్లో ఉన్న 35 జిగ్లీ కేంద్రాల్లో నిర్వహించిన ఈ వేడుకల్లో 2,500కి పైగా పెంపుడు జంతువులు, 3,500 మందికి పైగా పెట్ పేరెంట్స్ పాల్గొన్నారు.
