పారా ట్రాక్ సైక్లింగ్ పోటీల్లో ఆరో స్థానంలో లిషా దాస్ 

పారా ట్రాక్ సైక్లింగ్ పోటీల్లో ఆరో స్థానంలో లిషా దాస్ 

గ్లాస్గో : కామన్వెల్త్ క్రీడల చివరి రోజు భారత పారా సైక్లిస్ట్ లిషా దాస్ పతకం సాధించలేకపోయింది. మహిళల సీ4–సీ5 1000 మీటర్ల టైమ్ ట్రయల్ ఫైనల్లో పోటీపడిన లిషా ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. అసోంలోని తేజ్‌‌‌‌పూర్‌‌‌‌కు చెందిన 16 ఏళ్ల లిషా 1 నిమిషం 34.410 సెకన్లలో రేసును పూర్తి చేసింది. కామన్వెల్త్ క్రీడల్లో భారత జట్టులో అత్యంత చిన్న వయస్కురాలైన లిషా.. ప్రపంచంలోని అగ్రశ్రేణి పారా సైక్లిస్టులతో పోటీపడింది. తన శక్తిమేరకు రాణించినా పతక పోరులో నిలవలేక ఆరుగురు పోటీదారుల్లో చివరి స్థానంలో నిలిచింది.