91 బంతుల్లో  233 పరుగులు: డబుల్ సెంచరీతో అభిషేక్ శర్మ విధ్వంసం

91 బంతుల్లో  233 పరుగులు: డబుల్ సెంచరీతో అభిషేక్ శర్మ విధ్వంసం

చండీగఢ్: టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానిక వన్డే టోర్నీలో విధ్వంసక ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌తో చెలరేగాడు. అమృత్‌‌‌‌సర్ జట్టు తరఫున తరన్ తారన్ మెన్స్ సీనియర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌‌‌‌లో కేవలం 91 బంతుల్లోనే 233 పరుగులు చేసి డబుల్ సెంచరీ నమోదు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌‌‌‌లో 15 ఫోర్లు, ఏకంగా 25 సిక్సర్లు ఉండగా, 256.04 స్ట్రైక్‌‌‌‌రేట్‌‌‌‌తో ప్రత్యర్థి బౌలర్లను ఉతికిపారేశాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌‌‌‌లో మాత్రం అభిషేక్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

జింబాబ్వే పర్యటనలో మూడు ఇన్నింగ్స్‌‌‌‌ల్లో కలిపి కేవలం 11 పరుగులే చేసి తీవ్ర నిరాశపరిచాడు. ముజరబానీ బౌలింగ్‌‌‌‌లో ఆఫ్‌‌‌‌స్టంప్ వెలుపల పడిన బంతులను అంచనా వేయలేక వరుసగా వికెట్లు కోల్పోయాడు. అంతకుముందు ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్‌‌‌‌‎ల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. గత 10 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌‌‌‌ల్లో ఒక్క అర్ధసెంచరీ మాత్రమే నమోదు చేయడంతో ఐసీసీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌‌‌‌లో నంబర్-1 స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడు.

అయితే, ఈ హైస్పీడ్​డబుల్ సెంచరీతో అభిషేక్ మళ్లీ తన ఫామ్‎ను అందుకున్నాడనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాబోయే అంతర్జాతీయ సిరీస్‌‌‌‌లకు ముందు ఈ ఇన్నింగ్స్ అతడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని, జాతీయ జట్టులో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.