సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
అశోక్ నగర్‌లోని ఉదయ్ కృష్ణారెడ్డి గదిలో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక ఆధారాలు లభించాయి. ఉదయ్ గది నుంచి రెండు ప్రేమలేఖలతో పాటు, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అంతేకాకుండా, ఉదయ్‌కి మరో మహిళతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఏపీకి చెందిన ఓ వివాహితతో ఆయనకు సాన్నిహిత్యం ఉన్నట్లు తేలింది. భర్తతో విడిపోయి ప్రస్తుతం ఆ మహిళ హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ ప్రేమలేఖలు, వివాహితతో ఉన్న సంబంధానికి.. ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.
