రిపోర్ట్ పేజీలు మాయం కాలే.. అదంతా ఫేక్ తెలంగాణ విద్యా కమిషన్

రిపోర్ట్ పేజీలు మాయం కాలే.. అదంతా ఫేక్ తెలంగాణ విద్యా కమిషన్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించిన నివేదికలో కొన్ని పేజీలు మిస్ అయ్యాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కమిషన్ ఖండించింది. ఇదంతా తప్పుడు ప్రచారమేనని, వెబ్‌‌సైట్‌‌లో పెట్టిన రిపోర్ట్ పక్కాగా ఉందని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

మొత్తం 354 పేజీలతో కూడిన పూర్తి స్థాయి నివేదిక వెబ్‌‌సైట్‌‌లో అందరికీ అందుబాటులో ఉందని, పేజీలు మాయమయ్యాయనే వదంతులను నమ్మొద్దని పేర్కొంది.